రావు రఘునందన్ రావు
రావు రఘునందన్ రావు | |||
| |||
పదవీ కాలం 13 జనవరి 2020 – ప్రస్తుతం | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 30 జూన్ 1964 హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
తల్లిదండ్రులు | రావు చిన్నారావు, విలసిత కుమారి | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ |
రావు రఘునందన్ రావు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]రావు రఘునందన్ రావు 30 జూన్ 1964లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో రావు చిన్నారావు, విలసిత కుమారి దంపతులకు జన్మించాడు. ఆయన రామంతాపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పదవ తరగతి, నాగార్జున యూనివర్సిటీ నుండి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో 1988లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.[2]
వృత్తి జీవితం
[మార్చు]రావు రఘునందన్ రావు లా పూర్తి చేశాక సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద జూనియర్ న్యాయవాదిగా చేరాడు. ఆయన 1993 నుంచి 94 వరకు ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ) గా, 1995లో అడ్వొకేట్ జనరల్‌కు సహకరించేందుకు స్పెషల్ ఏజీపీగా నియమితులయ్యాడు. ఆయన 1996 నుంచి సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, వాణిజ్య, రాజ్యాంగపరమైన కేసులను వాదించాడు. రావు రఘునందన్ రావు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ తదితరాలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేసి 2013లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి అందుకొని ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో కేంద్రప్రభుత్వం తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నాడు. ఆయన 2020 జనవరి 11లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై 2020 జనవరి 13న న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (12 January 2020). "Andhra Pradesh High Court gets four new judges". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
- ↑ Andrajyothy (11 January 2020). "హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
- ↑ Sakshi (11 January 2020). "హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.