టి.రజనీ
తెల్లప్రోలు రజని | |||
పదవీ కాలం 2017 జనవరి 1 – 2020 నవంబర్ 5 | |||
నియమించిన వారు | ప్రణబ్ ముఖర్జీ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1958 నవంబర్ 6 అన్నంభొట్లవారిపాలెం, పర్చూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
తల్లిదండ్రులు | వెంకటప్పయ్య, రామతులశమ్మ |
తెల్లప్రోలు రజనీ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమె 2017 జనవరి 1 నుండి 2020 నవంబర్ 5 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించింది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]టి.రజనీ 1958 నవంబర్ 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, పర్చూరు మండలం, అన్నంభొట్లవారిపాలెం గ్రామంలో వెంకటప్పయ్య, రామతులశమ్మ దంపతులకు జన్మించింది. ఆమె ఇంటర్మీడియట్ వరకు గుంటూరులో పూర్తి చేసి, ఆంధ్ర యూనివర్సిటీ నుండి 1980లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని 1981లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుంది.
వృత్తి జీవితం
[మార్చు]టి.రజనీ లా పూర్తి చేశాక 1982లో గుంటూరులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టి 2002లో న్యాయాధికారిగా నియమితురాలైంది. ఆమె తరువాత కరీంగర్ జిల్లా II అదనపు జడ్జిగా, కరీంగర్ జిల్లా I అదనపు జడ్జిగా, హైదరాబాద్ మహిళా కోర్టు జడ్జిగా, మెదక్ జిల్లా జడ్జిగా ఉమ్మడి రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేసి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఆమె 17 జనవరి 2017న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకొని 05 నవంబర్ 2020న న్యాయమూర్తిగా పదవి విరమణ చేసింది.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ dtNext (6 November 2020). "Andhra HC Judge T. Rajani superannuates" (in ఇంగ్లీష్). Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ Sakshi (12 January 2017). "హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ Sakshi (16 January 2017). "ఉమ్మడి హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.