Jump to content

బట్టు దేవానంద్

వికీపీడియా నుండి
బట్టు దేవానంద్‌
బట్టు దేవానంద్


మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
24 మార్చి 2023 – ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

పదవీ కాలం
13 జనవరి 2020 – 23 మార్చి 2023

వ్యక్తిగత వివరాలు

జననం 14 ఏప్రిల్‌ 1966
చౌదరిపేట, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు బట్టు వెంకటరత్నం, మనోరంజితం
జీవిత భాగస్వామి కర్ర పద్మ కుమారి
సంతానం మౌని బట్టు, కీర్తి బట్టు
పూర్వ విద్యార్థి ఆంధ్రా యూనివర్సిటీ

బట్టు దేవానంద్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 13 జనవరి 2020 నుండి 23 మార్చి 2023 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి[1] మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బట్టు దేవానంద్‌ 14 ఏప్రిల్‌ 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, గుడివాడ, చౌదరిపేటలో బట్టు వెంకటరత్నం, మనోరంజితం దంపతులకు జన్మించాడు. ఆయన గుడివాడలోని మున్సిపల్‌ పాఠశాలలో పదవ తరగతి వరకు, బీఏ గుడివాడలోని ఏఎన్‌ఆర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఏ పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎల్‌ పూర్తి చేసి 06 జూలై 1989న న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.[3]

వృత్తి జీవితం

[మార్చు]

బట్టు దేవానంద్‌ బీఎల్‌ పూర్తి చేశాక విశాఖపట్నం జిల్లా కోర్టులో సీనియర్‌ న్యాయవాది ఎం.కె.సీతారామయ్య వద్ద 1989 నుంచి 1992 వరకు జూనియర్‌గా పనిచేసి 1993 నుంచి సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆయన 1996 నుండి 2000 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగాపని చేశాడు. బట్టు దేవానంద్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఎస్‌బీహెచ్‌, ఎన్‌టీపీసీ కౌన్సిల్‌గా పనిచేశాడు.

బట్టు దేవానంద్‌ 2006లో ఏపీ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా, బార్‌ కౌన్సిల్‌ డిసిప్లినరీ కమిటీ మెంబర్‌గా, ఏపీ అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ కమిటీ సభ్యుడిగా 2006 నుండి 2012 వరకు బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన 2014 జూలై 14 నుండి ఆంధ్రప్రదేశ్ రవాణా, రహదారులు భవనాలు, ఉన్నత, సాంకేతిక విద్య, ఎక్సయిజ్‌, వైద్య, ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తూ 2020 జనవరి 11లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై 2020 జనవరి 13న న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (12 January 2020). "Andhra Pradesh High Court gets four new judges". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
  2. Eenadu (24 March 2023). "జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.
  3. Andrajyothy (11 January 2020). "హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
  4. Sakshi (11 January 2020). "హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.