Jump to content

తర్లాడ రాజశేఖర రావు

వికీపీడియా నుండి
తర్లాడ రాజశేఖరరావు

పదవీ కాలం
2022 ఫిబ్రవరి 14 – ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 3 ఆగస్టు 1967
మూల సౌలాపురం, సరుబుజ్జిలి మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
తల్లిదండ్రులు కల్యాణి, సురన్నాయుడు
పూర్వ విద్యార్థి ఎన్‌బీఎం లా కళాశాల

తర్లాడ రాజశేఖర రావు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా[1],2022 ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తర్లాడ రాజశేఖరరావు 3 ఆగస్టు 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, సరుబుజ్జిలి మండలం, మూల సౌలాపురం గ్రామంలో సురన్నాయుడు, కళ్యాణి దంపతులకు జన్మించాడు. ఆయన విశాఖపట్నం ఎన్‌బీఎం కాలేజీలో బీఎస్‌సీ, బీఎల్‌ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

తర్లాడ రాజశేఖరరావు బీఎల్‌ పూర్తి చేశాక 1993 ఆగస్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వీవీఎస్‌ రావు న్యాయవాదిగా ఉన్న సమయంలో ఆయన వద్ద జూనియర్‌గా వృత్తి మెలకువలు నేర్చుకొని తరువాత సొంతంగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుతో పాటు, ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తూ ప్రజాహిత వ్యాజ్యాలతో పాటు క్రిమినల్‌, సివిల్‌ కేసులు వాదించాడు. ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ ఉమేశ్‌ ఉదయ్‌ లలిత్, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (31 January 2022). "ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
  2. Andhra Jyothy (14 February 2022). "ఏడుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  3. Sakshi (1 February 2022). "హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు!". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
  4. Andhra Jyothy (1 February 2022). "హైకోర్టుకు మరో ఏడుగురు జడ్జీలు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.