చాగరి ప్రవీణ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.ప్రవీణ్‌ కుమార్
చాగరి ప్రవీణ్ కుమార్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 అక్టోబరు 6 - ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1961 ఫిబ్రవరి 26
హైదరాబాద్
తల్లిదండ్రులు సి.పద్మనాభ రెడ్డి
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

చాగరి ప్రవీణ్‌ కుమార్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాడు. సి.ప్రవీణ్‌ కుమార్ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ హైకోర్టు విభజన తరువాత 2019 జనవరి 1 నుండి 2019 అక్టోబరు 6 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా పని చేశాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సి.ప్రవీణ్‌ కుమార్ 1961 ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో జన్మించాడు. ఆయన ఒకటి నుంచి పదో తరగతి వరకు లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో, ఇంటర్మీడియట్‌ లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజీలో, నిజాం కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు. ఆయన 1986 ఫిబ్రవరి 28న ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.[2]

వృత్తి జీవితం

[మార్చు]

సి.ప్రవీణ్‌ కుమార్ తన తండ్రి సి.పద్మనాభరెడ్డి వద్ద న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి క్రిమినల్‌, రాజ్యాంగ సంబంధ కేసులు వాదించాడు.ఆయన తండ్రి సి. పద్మనాభరెడ్డి 60 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో ఉన్నాడు. ఆయన అనంతపురం జిల్లా యాడికి గ్రామంలో జన్మించాడు. ఆయన 2012 జూన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడై, 2013 డిసెంబరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు. ఉమ్మడి హైకోర్టు విభజన నోటిఫికేషన్‌ 2018 డిసెంబరు 26న వెలువడింది. దీంతో జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా నియమితుడైన సి.ప్రవీణ్‌ కుమార్ 2019 జనవరి 1న భాద్యతలు చేపట్టి 2019 అక్టోబరు 6 వరకు ఆ భాద్యతలు నిర్వహించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (27 December 2018). "ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ప్రవీణ్‌కుమార్‌". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  2. Sakshi (27 December 2018). "ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ప్రవీణ్‌కుమార్‌". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  3. BBC News తెలుగు (1 January 2019). "కొలువుదీరిన కొత్త హైకోర్ట్.. న్యాయమూర్తులతో ప్రమాణం చేయించిన గవర్నర్". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.