రాకేష్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాకేష్ కుమార్

పదవీ కాలం
2019 నవంబర్ 8 – 2020 డిసెంబర్ 31
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1959 జనవరి 1
పాట్నా, బిహార్, భారతదేశం

రాకేష్ కుమార్ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2019 నవంబరు 8 నుండి 2020 డిసెంబరు 31 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రాకేష్‌కుమార్ 1959 జనవరి 1న బీహార్ రాష్ట్రం, పాట్నాలో జన్మించారు. ఆయన ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, 1983 మార్చి 8న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.[1]

వృత్తి జీవితం

[మార్చు]

రాకేష్‌కుమార్ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక పాట్నా హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టి రాజ్యాంగ, క్రిమినల్ కేసులను వాదించాడు. ఆయన 12 ఏళ్ల పాటు సీబీఐకి స్టాండింగ్ కౌన్సిల్‌గా, కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా, పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా పనిచేశాడు. జస్టిస్ రాకేష్‌కుమార్ 2009 డిసెంబరు 25న పాట్నా హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులై 2011, అక్టోబరు 24న శాశ్వత న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఆయనను 2019 అక్టోబరు 30న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై, [2] 2019 నవంబరు 8న బాధ్యతలు చేపట్టి[3], 2020 డిసెంబరు 31న 2020 డిసెంబరు 31న న్యాయమూర్తిగా పదవీవిరమణ చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi Education (31 October 2019). "ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్‌కుమార్". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  2. The Hindu (17 October 2019). "SC Collegium recommends transfer of Patna High Court CJ and Justice Rakesh Kumar" (in Indian English). Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  3. Sakshi (9 November 2019). "హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ప్రమాణం". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  4. Sakshi (1 January 2021). "జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ పదవీ విరమణ". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.