మటం వెంకటరమణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మఠం వెంకటరమణ
మటం వెంకటరమణ


పదవీ కాలం
2019 జూన్ 20 – 2022 ఫిబ్రవరి 11
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 12 ఫిబ్రవరి 1960
గుత్తి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
తల్లిదండ్రులు మటం నారాయణరావు, కమల
జీవిత భాగస్వామి ప్రతిమ రమణ
సంతానం శ్రీకర్ రఘోత్తం
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

మఠం వెంకటరమణ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2019 జూన్ 20 నుండి 2022 ఫిబ్రవరి 11 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు..[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

మటం వెంకటరమణ 1960 ఫిబ్రవరి 12లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, గుత్తిలో మటం నారాయణరావు, కమల దంపతులకు జన్మించాడు. ఆయన గుత్తిలోని మాల్టాస్ స్మిత్ హైస్కూల్ లో పదవ తరగతి వరకు, తిరుపతి లోని ఎస్.వి జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్, అనంతరపురంలోని ప్రభుత్వ కళాశాలలో బి.ఎస్సీ, బెంగుళూరులోని శ్రీ జగద్గురు రేణుకాచార్య కాలేజీ నుండి ఎల్.ఎల్.బి పూర్తి చేసి, హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.ఎం పూర్తి చేశాడు.[2]

వృత్తి జీవితం[మార్చు]

మటం వెంకటరమణ ఎల్.ఎల్.ఎం పూర్తి 1982లో న్యాయవాదిగా పేరు మనోడు చేసుకొని తన తండ్రి ఎం.నారాయణరావు, సీనియర్‌ న్యాయవాది జయరాం వద్ద జూనియర్ గా చేరి వృత్తి మెళకువలు నేర్చుకొని 1987 ఏప్రిల్ 01న జుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించి [3] చిత్తూరు, పీలేరు, నంద్యాల, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులలో వివిధ హోదాల్లో పనిచేసి 1993లో సబ్ జడ్జిగా పదోన్నతి అందుకొని ఆదోని, నెల్లూరు, కర్నూలు, హైదరాబాద్‌లోని సీబీఐ ప్రధాన కోర్టు జడ్జిగా, 2019, జనవరి 7 నుంచి కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా (పీడీజే) విధులు నిర్వహించాడు. ఎం.వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకొని 2020 జూన్ 20న న్యాయమూర్తిగా ప్రమాణం చేసి 2022 ఫిబ్రవరి 11 వరకు విధులు నిర్వహించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (21 June 2019). "కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi Education (2020). "జూన్ 2019 వ్యక్తులు". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
  3. Sakshi (13 June 2019). "ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
  4. Eenadu (12 February 2022). "జస్టిస్‌ ఎం. వెంకటరమణకు ఘన వీడ్కోలు". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.