చీమలపాటి రవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చీమలపాటి రవి

పదవీ కాలం
2022 ఫిబ్రవరి 14 – ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 4 డిసెంబర్‌ 1967
విశాఖపట్నం, విశాఖపట్నం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు శ్రీరామమూర్తి
పూర్వ విద్యార్థి ఆంధ్రా యూనివర్సిటీ

చీమలపాటి రవి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా[1],2022 ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

చీమలపాటి రవి 4 డిసెంబర్‌ 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా , విశాఖపట్నంలో జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి బీకాం, బీఎల్‌ పూర్తి చేసి 1995లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.

వృత్తి జీవితం

[మార్చు]

చీమలపాటి రవి బీఎల్‌ పూర్తి చేశాక తన తండ్రితో కలిసి విశాఖ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి తరువాత హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టుకు తన ప్రాక్టీస్‌ ను మార్చుకొని సివిల్‌, క్రిమినల్‌, రెవెన్యూ, రాజ్యాంగ సంబంధ వ్యాజ్యాలలో న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. చీమలపాటి రవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడేళ్ల పాటు పంచాయతీరాజ్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేసి, 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి హైకోర్టుకు ప్రాక్టీసు మర్చి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేస్తున్నాడు. ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ ఉమేశ్‌ ఉదయ్‌ లలిత్, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (31 January 2022). "ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
  2. Andhra Jyothy (14 February 2022). "ఏడుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  3. Sakshi (1 February 2022). "హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు!". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
  4. Andhra Jyothy (1 February 2022). "హైకోర్టుకు మరో ఏడుగురు జడ్జీలు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.