Jump to content

దొనాడి రమేశ్‌

వికీపీడియా నుండి
(దొనడి రమేశ్ నుండి దారిమార్పు చెందింది)
దొనడి రమేశ్
దొనాడి రమేశ్‌


పదవీ కాలం
2025 అక్టోబర్ 17 – ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
2023 జూలై 24 – 2025 అక్టోబర్ 16

పదవీ కాలం
2020 జనవరి 13 – 2023 జూలై 23

వ్యక్తిగత వివరాలు

జననం 27 జూన్‌ 1965
కమ్మపల్లి, సోమల మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు డీవీ నారాయణ నాయుడు, అన్నపూర్ణ
పూర్వ విద్యార్థి ఆంధ్రా యూనివర్సిటీ

దొనాడి రమేశ్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

దొనడి రమేశ్ 27 జూన్‌ 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, సోమల మండలం, కమ్మపల్లి గ్రామంలో డీవీ నారాయణ నాయుడు, అన్నపూర్ణ దంపతులకు జన్మించాడు. ఆయన కమ్మపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు, తిరుపతిలోని ఎస్‌వీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, ఎస్‌వీ ఆర్ట్స్‌ కాలేజీలో బీకాం పూర్తి చేసి నెల్లూరులోని వీఆర్‌ లా కళాశాలలో బీఎల్‌ పట్టా అందుకోని 1990లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.[2]

వృత్తి జీవితం

[మార్చు]

దొనడి రమేశ్ బీఎల్‌ పూర్తి చేశాక విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నారాయణ వద్ద జూనియర్‌గా చేరి కొంతకాలం తర్వాత సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించి పరిపాలనా ట్రిబ్యునల్‌లో కేసులు వాదించాడు. ఆయన 2000 నుండి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా సర్వీసు సంబంధ వివాదాల వ్యవహారాలను, 2007 నుంచి 2013 వరకు ఏపీ సర్వశిక్షా అభియాన్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 2014 నుంచి 2019 వరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బెంచ్‌కు పదోన్నతి అందుకొని 2020 జనవరి 11లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై 2020 జనవరి 13న న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు.[3]

దొనడి రమేశ్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయబడి 2023 జూలై 24న న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4][5] ఆయన తిరిగి 2025 అక్టోబర్ 17న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తిరిగి బదిలీ చేయబడ్డాడు.[6]  

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (12 January 2020). "Andhra Pradesh High Court gets four new judges". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
  2. Andrajyothy (11 January 2020). "హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
  3. Sakshi (11 January 2020). "హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
  4. "One judge each from AP and TS transferred out | One judge each from AP and TS transferred out" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 14 July 2023. Archived from the original on 17 October 2025. Retrieved 17 October 2025.
  5. "Hon'ble Mr. Justice Donadi Ramesh". Allahabad High Court. 17 October 2025. Archived from the original on 17 October 2025. Retrieved 17 October 2025. {{cite news}}: no-break space character in |title= at position 8 (help)
  6. "ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్‌ దోనాడి రమేశ్‌". Eenadu. 17 October 2025. Archived from the original on 17 October 2025. Retrieved 17 October 2025.