సత్తి సుబ్బారెడ్డి
సత్తి సుబ్బారెడ్డి | |||
పదవీ కాలం 2022 ఫిబ్రవరి 14 – ప్రస్తుతం | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 5 ఫిబ్రవరి 1970 అరవల్లి, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
తల్లిదండ్రులు | బాలనాగేంద్ర రెడ్డి, లక్ష్మీదేవి | ||
పూర్వ విద్యార్థి | ఆంధ్రా యూనివర్సిటీ |
సత్తి సుబ్బారెడ్డి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా[1],2022 ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశాడు.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]సత్తి సుబ్బారెడ్డి 5 ఫిబ్రవరి 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి మండలం, అరవల్లి గ్రామంలో బాలనాగేంద్ర రెడ్డి, లక్ష్మీదేవి దంపతులకు జన్మించాడు. ఆయన 1989లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి బీఏ , 1993లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1994 జూన్ 22న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.
వృత్తి జీవితం
[మార్చు]సత్తి సుబ్బారెడ్డి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక 1994లో తాడేపల్లిగూడెంలో ప్రాక్టీస్ మొదలు పెట్టి 1997 వరకు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడు. ఆయన 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రాక్టీస్ మర్చి సీనియర్ న్యాయవాది వీఎల్‌ఎన్ గోపాలకృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా చేరి హైకోర్టులో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, సర్వీసు సంబంధ కేసులను వాదించాడు. ఆయన తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీకి స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశాడు. ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ ఉమేశ్ ఉదయ్ లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (31 January 2022). "ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
- ↑ Andhra Jyothy (14 February 2022). "ఏడుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
- ↑ Sakshi (1 February 2022). "హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు!". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
- ↑ Andhra Jyothy (1 February 2022). "హైకోర్టుకు మరో ఏడుగురు జడ్జీలు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.