కన్నెగంటి లలిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌరవ జస్టిస్ లలిత కన్నెగంటి
కన్నెగంటి లలిత


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
02 మే 2020
సూచించిన వారు శరద్ అరవింద్ బాబ్డే
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 5 మే 1971
జమ్ములపాలెం గ్రామం, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
తల్లిదండ్రులు కొమ్మినేని అంకమ్మ చౌదరి, అమరేశ్వరి
జీవిత భాగస్వామి కన్నెగంటి విజయప్రసాద్
సంతానం గౌతమ్
మానస
పూర్వ విద్యార్థి పడాల రామారెడ్డి లా కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ

కన్నెగంటి లలిత కుమారి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉంది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కన్నెగంటి లలిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, బాపట్ల మండలం, జమ్ములపాలెం గ్రామంలో 1971 మే 5లో జన్మించాడు. ఆమె 10వ తరగతి వరకు బాపట్లలో, హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి లా కాలేజీ నుంచి 1994లో లా డిగ్రీ పూర్తి చేసి 1994లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుంది.[2]

వృత్తి జీవితం

[మార్చు]

కన్నెగంటి లలిత లా పూర్తి చేశాక సీనియర్‌ న్యాయవాది ఎంఆర్‌కే చౌదరి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టి ఆ తర్వాత న్యాయవాదులు కె.హరినాథ్, ఒ.మనోహర్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేసి 2008లో సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించింది. ఆమె ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 2011లో తిరుమల తిరుపతి దేవస్థానానికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, సంస్కృత విశ్వవిద్యాలయానికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేసింది.[3] కన్నెగంటి లలిత కుమారి 2020 మే 02న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టింది.[4]

జస్టిస్ కన్నెగంటి లలిత కుమారిని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తూ కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 2023 జులై 13న ఉత్తర్వులు జారీ చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. The Hindu (2 May 2020). "Three sworn in as High Court judges" (in Indian English). Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  2. ETV Bharat News (3 May 2020). "వారి కృతజ్ఞతే నాకు స్ఫూర్తి: జస్టిస్ లలిత". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  3. Sakshi (21 April 2020). "హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  4. The New Indian Express (3 May 2020). "3 sworn in as HC judges". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.