ధీరజ్ సింగ్ ఠాకూర్
ధీరజ్ సింగ్ ఠాకూర్ | |||
పదవీ కాలం 25 జులై 2023 – ప్రస్తుతం | |||
సూచించిన వారు | ఉదయ్ ఉమేశ్ లలిత్ | ||
---|---|---|---|
నియమించిన వారు | ద్రౌపది ముర్ము | ||
బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 10 జూన్ 2022 – 24 జులై 2023 | |||
సూచించిన వారు | ఎన్.వి. రమణ | ||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
హైకోర్ట్ న్యాయమూర్తి జమ్మూ & కాశ్మీర్
| |||
పదవీ కాలం 8 మార్చ్ 2013 – 9 జూన్ 2022 | |||
సూచించిన వారు | అల్తమస్ కబీర్ | ||
నియమించిన వారు | ప్రణబ్ ముఖర్జీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జమ్మూ & కాశ్మీర్ | 25 ఏప్రిల్ 1964
ధీరజ్ సింగ్ ఠాకూర్ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2023 జులై 25న నియమితుడయ్యాడు.[1][2][3]
వృత్తి జీవితం
[మార్చు]ధీరజ్ సింగ్ ఠాకూర్ ఎల్.ఎల్.బి పూర్తి చేసి 1989 అక్టోబర్ 18న ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు. ఆయన 2011లో సీనియర్ న్యాయమూర్తిగా పదోన్నతి అందుకొని 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. ధీరజ్ సింగ్ ఠాకూర్ జూన్ 10, 2022న బొంబాయి హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను 2022 ఫిబ్రవరి 9న కొలీజియం ఆయనను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సిఫారసు చేసింది. అయితే ఆ సిఫార్సు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండడంతో కొలీజియం దానిని రద్దు చేసి, 2023 జులై 5న ఆయనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించగా, జూలై 24న కేంద్ర న్యాయశాఖ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (25 July 2023). "బాంబే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం." (in Telugu). Archived from the original on 25 July 2023. Retrieved 25 July 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Hindustantimes Telugu (25 July 2023). "ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్ సింగ్ ఠాకూర్ నియామకం". Archived from the original on 25 July 2023. Retrieved 25 July 2023.
- ↑ The Hindu (24 July 2023). "New Chief Justice for Andhra Pradesh High Court" (in Indian English). Archived from the original on 25 July 2023. Retrieved 25 July 2023.
- ↑ Sakshi (25 July 2023). "ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్". Archived from the original on 25 July 2023. Retrieved 25 July 2023.