కె.వి.ఎల్.నరసింహం

వికీపీడియా నుండి
(కె.వి.యల్.నరసింహం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కె.వి.ఎల్.నరసింహం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి
పదవీ కాలము
1971 – 1972
ముందు ఎన్.కుమారయ్య
తరువాత గోపాలరావు ఎక్బోటే

వ్యక్తిగత వివరాలు

జననం (1910-04-01) 1910 ఏప్రిల్ 1
మరణం 1973 09అక్టోబరు

జస్టిస్ కె.వి.ఎల్.నరసింహం (1910–1973) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి[1]

నరసింహం 1910 ఏప్రిల్ 1 న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం సికింద్రాబాదు ఇస్లామియా పాఠశాలలో, నెల్లూరు వి.ఆర్.కళాశాల ఉన్నత పాఠశాలలో, విజయవాడ హిందూ ఉన్నత పాఠశాలలో సాగింది. ఆ తర్వాత మద్రాసు పచ్చయ్యప్ప కళాశాలలో పట్టభద్రుడై, మద్రాసు లా కాలేజీలో న్యాయవాద విద్యను అభ్యసించాడు. 1935, ఏప్రిల్ 1న మద్రాసులో హైకోర్టులో వకీలుగా నమోదు చేసుకున్నాడు. 1946లో రాష్ట్ర హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసులో చేరాడు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత డిస్ట్రిక్ అండ్ సెషన్స్ న్యాయమూర్తిగా రాష్ట్రానికి వచ్చాడు. 1957 నుండి 1958 మార్చి వరకు ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్సుకు అధ్యక్షుడిగా పనిచేశాడు. 1958 ఏప్రిల్ నుండి 1959 ఏప్రిల్ వరకు సిటీ సివిల్ కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. 1959 మే 1 నుండి హైకోర్డులో న్యాయమూర్తిగా నియమించబడేవరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిజిష్ట్రారుగా పనిచేశాడు. 1959, డిసెంబరు 9న అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. తిరిగి 1961లో అదనపు న్యాయమూర్తిగా నియమించబడి, 1962, జూన్ 7న శాశ్వత న్యాయమూర్తి అయ్యాడు. 1971 జూన్ 15 నుండి 1972, ఏప్రిల్ 1 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు.

మూలాలు[మార్చు]