పి. సత్యనారాయణ రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెన్మత్స సత్యనారాయణ రాజు
P. Satyanarayana Raju
పి. సత్యనారాయణ రాజు


పదవీ కాలము
1964 – 1965
ముందు పి. చంద్రారెడ్డి
తరువాత మనోహర్ ప్రసాద్

పదవీ కాలము
1965 – 1966

వ్యక్తిగత వివరాలు

జననం (1908-08-17) 1908 ఆగస్టు 17
అజ్జరం, తణుకు తాలూకా, పశ్చిమ గోదావరి జిల్లా, భారత దేశము
మరణం 1966 ఏప్రిల్ 20
న్యూఢిల్లీ, భారత దేశము

జస్టిస్ పెన్మెత్స సత్యనారాయణ రాజు బి.ఎ.బి.ఎల్. (ఆగష్టు 17, 1908 - ఏప్రిల్ 20, 1966) ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.[1]

జీవిత సంగ్రహం[మార్చు]

వీరు 1908 ఆగష్టు 17 తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని అజ్జరం గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రామభద్రరాజు, సుభద్రమ్మ.

వీరు తణుకు బోర్డు ఉన్నత పాఠశాలలో చదివి విజయనగరంలోని మహారాజా కళాశాల నుండి బి.ఏ. పట్టా పొందారు. తదనంతరం మద్రాసు న్యాయ కళాశాల నుండి బి.ఎల్. పట్టాపొందారు. తర్వాత 1930లో మద్రాసు బార్ లో చేరారు. వీరి టంగుటూరి ప్రకాశం వద్ద మూడు సంవత్సరాలు మరియు పి. సత్యనారాయణ రావు గారి వద్ద కొంతకాలం పనిచేశారు. సమైక్య మద్రాసు రాష్ట్రంలో ప్రభుత్వ న్యాయవాదిగా 1950 నుండి పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారు.

వీరిని ఆంధ్ర హైకోర్టు న్యాయమూర్తిగా 1954 నవంబరు 1 లో నియమించబడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తద్ధర్మ ప్రధాన న్యాయమూర్తిగా 1963 లో కొంతకాలం పనిచేసిన తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా 1964 డిసెంబరు 30 తేదీన నియమించబడ్డారు.

వీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అక్కడి ప్రధాన న్యాయమూర్తి గజేంద్ర గడ్కర్ తో కలిసి రష్యాను సందర్శించి అక్కడి న్యాయవ్యవస్థను పరిశోధించారు.

వీరు 1966 ఏప్రిల్ 20 తేదీన న్యూఢిల్లీలో పరమపదించారు.

మూలాలు[మార్చు]