గోపాలరావు ఎక్బోటే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపాలరావు ఎక్బోటే
గోపాలరావు ఎక్బోటే


పదవీ కాలం
1972 – 1974
ముందు కె.వి.ఎల్.నరసింహం
తరువాత ఎస్.ఓబులరెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1912-06-01)1912 జూన్ 1
మరణం 1994 జూన్ 4(1994-06-04) (వయసు 82)[1]

జస్టిస్ గోపాలరావు ఎక్బోటే స్వాతంత్ర్యసమరయోధుడు, హైదరాబాదుకు చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి[2]

గోపాలరావు 1912, జూన్ 1న నాగపూరులో జన్మించాడు. సరస్వతి భవన్ మాధ్యమిక పాఠశాలలో, ఔరంగాబాదు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తిచేసుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. తొలుత న్యాయవాదవృత్తిని ఔరంగాబాదులోని మున్సిఫ్ మాజిస్ట్రేట్ కోర్టులో, ఆ తర్వాత హైదరాబాదులోని సబార్డినేటు కోర్టులు, ఆ తర్వాత హైకోర్టులో ప్రాక్టీసు చేశాడు. 1948, నవంబరు 28న హైదరాబాదు హైకోర్టులో వకీలుగా నమోదుచేసుకున్నాడు. 1951లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా నమోదుచేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, ముఖ్యంగా సివిల్ లా కేసులు చేపట్టేవాడు.

గోపాలరావు, 1952లో జరిగిన తొలి హైదరాబాదు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో, కాంగ్రేసు పార్టీ తరఫున ఛాదర్‌ఘాట్ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1954 జనవరి 26 నుండి 1956 అక్టోబరు 31 వరకు బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో, హైదరాబాదు రాష్ట్రానికి విద్య, స్థానికసంస్థలు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు. 1957లో హైకోర్టు నియోజకవర్గం నుండి పోటీచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.

1962 జూన్ 7 నుండి రెండు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. ఆ తర్వాత 1964, ఫిబ్రవరి 24న, శాశ్వత న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. గోపాలరావు 1972 ఏప్రిల్ 1 నుండి 1974, జూన్ 1 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధానన్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు.

ఈయనకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. గోపాలరావు చక్కని ఉర్దూ వ్రాసేవాడు. సంవత్సరానికి రెండుసార్లు హైదరాబాదు జ్ఞాపకాలను సియాసత్ పత్రికలో వ్యాసాలుగా ప్రచురించేవాడు. చివరి నిజాం యొక్క కవిత్వాన్ని మెచ్చుకొన్నాడు. గోపాలరావు హిందీ భాషా ప్రచారంలోనూ, గ్రంథాలయోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. స్థానిక తెలుగు, మరాఠీ, కన్నడ భాషా గ్రంథాలయాల స్థాపనకై కృషిచేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Kumar, Pogula Sesha Giri (1977). Indian Library Chronology. Allied Publishers Pvt Limited. p. 1062.
  2. "Profile of Honorable Justice Gopal Rao Ekbote in Andhra Pradesh High Court". Archived from the original on 2015-03-17. Retrieved 2017-10-15.
  3. Leonard, Karen Isaksen. "Locating Home: India's Hyderabadis Abroad". Retrieved 15 October 2017.