యడ్లపాటి వెంకట్రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యడ్లపాటి వెంకట్రావు
VR Yadlapati.jpg
జననం16 డిసెంబరు 1919
బోడపాడు, గుంటూరుజిల్లా
మరణంఫిబ్రవరి 28, 2022
హైదరాబాదు
విద్యఎఫ్ ఏ , బి ఏ , న్యాయవాద కోర్సు 
వృత్తిన్యాయవాది, రాజకీయ నాయకుడు 
సుపరిచితుడు/
సుపరిచితురాలు
వంద సంవత్సరాలు నిండిన రాజకీయ నాయకులు. మాజీ మంత్రివర్యులు , జిల్లా పరిషత్ చైర్మన్ , పార్లమెంటు సభ్యులు .

యడ్లపాటి వెంకట్రావు (డిసెంబరు 16, 1919 - ఫిబ్రవరి 28, 2022) సీనియర్‌ రాజకీయ నాయకులు, రాజ్యసభ, శాసన సభలలో సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా విశేషమైన సేవలందించిన రైతు నాయకుడు. సంగం డెయిరీకి యడ్లపాటి వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడు.

జననం, విద్య[మార్చు]

యడ్లపాటి వెంకట్రావు 1919 డిసెంబర్ 16న గుంటూరుజిల్లా అమృతలూరు మండలంలోని బోడపాడు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మిచారు[1]. ఇతని తల్లిదండ్రులు రాఘవమ్మ , యడ్లపాటి వెంకటసుబ్బయ్య. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ చదివి 1941 చెన్నయ్ లో లా కాలేజీ  చదువుతూ  అందులో ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. తరువాత న్యాయవాద వృత్తిని అభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. అలవేలు మంగమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

ప్రముఖ రైతు నాయకుడు ఎన్.జి.రంగా ముఖ్యఅనుచరుడిగా ఆయనతో కలిసి అడుగులు వేశారు. ఎన్.జి రంగాతో కలిసి 1951 లో కృషీకార్ లోక్ పార్టీ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారు. ఆ తరువాత 1959 లో ఎన్.జి రంగా గారు రాజగోపాలాచారి తో కలసి స్థాపించిన స్వతంత్ర పార్టీ లో చేరారు.

స్వతంత్ర పార్టీ తరపున వేమూరు నియోజక వర్గం నుండి 1962లోనూ, 1965 ఉప ఎన్నికలోనూ పోటీ చేసి ఓటమి చెందారు. 1967, 1972 ఎన్నికలలో శాసన సభకు గెలుపొందారు. 1972 లో కాంగ్రెస్ ప్రభంజనంలో దేశమంతా స్వతంత్ర పార్టీ ఓడిపోతే, కోస్తా జిల్లాల మొత్తం మీద ఈయన ఒక్కరే గెలిచారు. ఆ తర్వాత ఎన్.జి రంగా గారితో కలసి కాంగ్రెస్ లో చేరి 1978 లో మళ్లీ వేమూరు నుంచి శాసన సభకు గెలుపొందారు. సంఘం డైరీ , జంపని షుగర్ మిల్లుల ఏర్పాటులో వీరి కృషి మరువలేనిది.[2]

మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో (1978 -1980) ప్రణాళిక-న్యాయశాఖ మంత్రిగా వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1983లో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటి చేసి ఓటమి చెందారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989 లో మరల ఓటమి చెందారు. తెలుగు దేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యునిగా, తెలుగు రైతు అధ్యక్షునిగా పనిచేసారు.

తెలుగు దేశం అభ్యర్దిగా 1995లో గుంటూరు జిల్లా పరిషత్ చైయిర్ మాన్ గా ఏన్నికై 1998 వరకుపనిచేసారు. 1998లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికైనారు. రాజ్యసభ పదవీకాలం 2004 లో ముగిసిన పిదప వీరు క్రియాశీల రాజకీయాలను వదిలి తెలుదేశం సభ్యునిగా కొసాగుతున్నారు.

శతజయంతి[మార్చు]

2011 లో వెంకట్రావు గారు తన స్వీయ జీవిత చరిత్రను 'నా జీవన గమనం' పేరుతో గ్రంధస్తం చేసారు. నిస్వార్ద రాజకీయ వేత్తగా, రైతు నాయకుడిగా నిండు నూరేళ్ళూ అయిన సందర్బంగా 2018 డిసెంబర్ 19న బొడపాడులో వారి శత జయంతి చంద్రబాబు గారి సమక్షంలో ఘనంగా జరిగింది[2]. ఆరోగ్యంగా జీవిస్తున్నారు.

మరణం[మార్చు]

102 ఏళ్ళ యడ్లపాటి వెంకట్రావు హైదరాబాద్‌లోని కుమార్తె నివాసంలో 2022 ఫిబ్రవరి 28న తుదిశ్వాస విడిచారు.[3]

మూలాలు[మార్చు]

  1. వెబ్‌మాస్టర్. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). పార్లమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభ. Rajya Sabha Secretariat. Retrieved 15 May 2020.
  2. 2.0 2.1 "Yadlapati will turn 100 tomorrow". THE HINDU. 2018-12-15. Retrieved 2021-07-18.
  3. "Andhra News: తెదేపా సీనియర్‌ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత". EENADU. Retrieved 2022-02-28.