పుట్టుగుంట వెంకట సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పుట్టుగుంట వెంకట సుబ్బారావు ప్రముఖ రంగస్థల నటులు.

జననం

[మార్చు]

వెంకట సుబ్బారావు 1939లో వేమూరు గ్రామంలో రాఘవయ్య, వెంకటలక్ష్మీ దంపతులకు జన్మించారు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

తెలుగుతల్లి నాటకంలోని నాగేశ్వరరావు పాత్రతో రంగస్థలంపై అడుగుపెట్టారు. రాగయుక్తంగా పద్యాలు పాడడంతో వీరికి అమితమైన ఆదరణ లభించింది. అగ్రశ్రేణి నటులందరితో నటించారు. ఈయన నటలుగా రాణించడానికి తుమ్మల ఆంజనేయులు, వేమూరి రామయ్య, శనగవరపు శ్రీరామమూర్తి మొదలైనవారి ప్రభావం ఉంది.

పోషించిన పాత్రలు

[మార్చు]
  • నారదుడు
  • ధృతరాష్ట్రుడు
  • శల్యుడు
  • నక్షత్రకుడు

సన్మానాలు

[మార్చు]

కాకినాడ, నెల్లూరు లలో ధృతరాష్ట్రుడు, శల్యుడు మొదలైన పాత్రలకు సన్మానాలు జరిగాయి.

ఇతర వివరాలు

[మార్చు]

గ్రామ పంచాయితీ శాఖలో ఉద్యోగిగా ఉంటూ వేమూరి రామయ్య నాటక సమాజంలో పనిచేశారు.

మూలాలు

[మార్చు]
  • పుట్టుగుంట వెంకట సుబ్బారావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 264.