Coordinates: 16°07′48″N 79°56′56″E / 16.13°N 79.949°E / 16.13; 79.949

పాతమాగులూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 16°07′48″N 79°56′56″E / 16.13°N 79.949°E / 16.13; 79.949
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంసంతమాగులూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


పాతమాగులూరు , బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.పటం

సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

తారకరామ తంగేడుమిల్లి మేజరు ఎత్తిపోతల పథకం.

గ్రామ పంచాయతీ[మార్చు]

  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో షేక్ సైదా, రెండు సంవత్సరములకు సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. తరువాత చవల రాధాకృష్ణమూర్తి మూడు సంవత్సరములకు సర్పంచిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
  • షేక్ సైదా, 2015, సెప్టెంబరు-22వ తేదీనాడు తన పదవికి రాజీనామ చేసారు. ఉపసర్పంచి చవల రాధాకృష్ణమూర్తికి, తాత్కాలిక సర్పంచ్ బాధ్యతలతోపాటు, చెక్ పవరును గూడా అందజేయుచూ డి.పి.ఓ. అఫీసునుండి ఉత్తర్వులు జారీ చేసారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండరామాలయo[మార్చు]

ఈ గ్రామంలో రు.40 లక్షలతో నిర్మించిన కోదండరామాలయంలో 2013 ఆగస్టు 24 శనివారంనాడు ఉదయం 8-27 గంటలకు శ్రీ కోదందరాముడు, సీతల విగ్రహాల ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఐదు వేలమందికి అన్నదానం చేశారు.

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

పాతమాగులూరు గ్రామ ప్రధాన కూడలిలోని ఈ ఆలయం రెండు శతాబ్దాల చరిత్ర గలది. ఈ ఆలయాన్ని గ్రామస్థుల సమష్టి కృషితో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మాణం చేశారు. ఈ ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకలు, 2015, మే-29వ తేదీ శుక్రవారంనాడు, కన్నులపండువగా ప్రారంభమైనవి. 30వ తేదీ శనివారం ఉదయం మన్యుసూక్త, శాంతిహోమాలు, విగ్రహ, ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకాలు, మూలమంత్ర జపాలు చేసారు. సాయంత్రం బలిహరణ, గ్రామోత్సవం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, మూలమంత్ర హోమాలు వైభవంగా నిర్వహించారు. 31వ తేదీ ఆదివారం ఉదయం 9-06 గంటలకు, జీర్ణోద్ధరణ, త్రయాహ్నిక, దీక్షాపూర్వక ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రాతఃకాలపూజ, నిత్యానుష్టాలు, మహాశాంతిహోమాలు, జీవన్యాసం, అష్టబంధన మహాపూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టినారు. స్వామిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమాలకు స్థానికులతోపాటు, పరిసరప్రాంతాలనుండి గూడా వచ్చిన భక్తులతో ఆలయప్రాంగణం కిటకిటలాడినది. ఈ సందర్భంగా గ్రామ విద్యార్థినులు ప్రదర్శించిన కోలాటప్రదరన పలువురిని ఆకట్టుకున్నది. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]