Coordinates: 16°07′48″N 79°56′56″E / 16.13°N 79.949°E / 16.13; 79.949

పత్తెపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 16°07′48″N 79°56′56″E / 16.13°N 79.949°E / 16.13; 79.949
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంసంతమాగులూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


ఫత్తేపురం, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.పటం

మౌలిక వసతులు[మార్చు]

ఈ గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ప్రధాన రహదారి నుండి 680 మీటర్ల పొడవుతో, సిమెంటుతో నిర్మించనున్న రహదారికి, 2017, ఆగస్టు-9న శంకుస్థాపన నిర్వహించారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కొల్లి రత్తాయమ్మ, సర్పంచ్‌గా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఫత్తేపురం గ్రామంలోని ప్రాచీన ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించెదరు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో, 2015, మార్చి-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం రాత్రి, అమ్మవారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పూజలు చేసి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాలనుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు.

ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయము మీద ఆధారపడి జీవిస్తున్నారు.

గ్రామ విశేషాలు[మార్చు]

మండలంలోనే 100% అక్షరాస్యత ఉన్న గ్రామం ఫత్తేపురం గ్రామంలోని యువకులు, ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేయుచున్నవారు, "కాకతీయ యువసేన"గా ఏర్పడి, రు. రెండున్నర లక్షల ఆర్థిక సహాయంతో, గ్రామంలో ఒక నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. ఈ కేంద్రానికి, 2014, జూన్-29, ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని యువకులను అభినందించారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]