అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా (పాట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరివెన్నెల సీతారామశాస్త్రి, పాటల రచయత

అర్ధ శతాబ్దపు పాట 1997లో విడుదలైన సింధూరం చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. శ్రీ సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాడు.[1]



పాటలోని సాహిత్యం

[మార్చు]
"అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా"
రచయితసిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతంశ్రీ
సాహిత్యంసిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రచురణసింధూరం (1997)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా!
చరణం 1:

కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే
సమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి, ఏమిటి సాధించాలి?
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! ఓ అనాథ భారతమా!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!

పురస్కారాలు

[మార్చు]
  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు -1997

మూలాలు

[మార్చు]
  1. హెచ్ఎంటివి, మిక్చర్ పొట్లం (24 November 2018). "ప్రజాస్వామ్య పండుగ, కొన్ని ప్రశ్నల పండగా..వచ్చిన పాట". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.

ఇతర లంకెలు

[మార్చు]
  1. స్వగతం వెబ్ సైట్ లో పాట గురించిన వ్యాసం
  2. యూట్యూబ్ లో పాట వీడియో