దక్కన్ పీఠభూమి

వికీపీడియా నుండి
(దక్కను పీఠభూమి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దక్కన్ పీఠభూమి

దక్కన్ పీఠభూమి (ఆంగ్లం : Deccan Plateau), ఇంకనూ ద్వీపకల్ప పీఠభూమి, మహాద్వీపకల్ప పీఠభూమి అనీ అంటారు.[1] భారత్ లోని పెద్ద పీఠభూమి. ఈ పీఠభూమి దక్షిణభారతాన్నంతటినీ ఆక్రమించింది. దీని ఎలివేషన్ ఉత్తరభాగాన 100 మీటర్లు, దక్షిణాన 1000 మీటర్లు గలదు. ఇది పర్వత శ్రేణుల్లో ప్రారంభమై, ఎనిమిది రాష్ట్రాలలో వ్యాపించియున్నది. భారత ఉపఖండంలోని అంతర్భాగంలో త్రికోణాకృతిలో సముద్రతీరం వరకూ వ్యాపించియున్నది.[2] ఈ పీఠభూమి మధ్యభారతంలోనూ, దక్షిణ భారతంలోనూ వ్యాపించియున్నది.[3] దీని పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు సరిహద్దులు కల్గివున్నది. ఈ కనుమల మధ్య ఎత్తుగా ఏర్పడిన భూభాగం ఈ పీఠభూమి. ఈశాన్యాన వింధ్య పర్వతాలు సత్పురా పర్వతాలు ఉన్నాయి. ఉత్తర పర్వత శ్రేణులు, ఉత్తరానగల నదీమైదానప్రాంతాలనుండి ఈ పీఠభూమికీ వేరు చేస్తున్నాయి. ఈ పీఠభూమి విశాలంగా వ్యాపించియున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, కర్నాటక,, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు చెందిన భాగాలు. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రపంచంలోనే నిలకడ కలిగి, అధిక ద్రవ్యరాశి గలది.[3] అనేక పెద్ద నదులను కలిగివున్న ప్రాంతం.[2]

దక్కన్ అనే పేరు ప్రాకృత పదమైన దక్ఖిన్, సంస్కృతపదమైన दक्षिण దక్షిణ నుండి ఆవిర్భవించింది.[4]

హంపి వద్ద పీఠభూమి దృశ్యం
దక్కన్ పీఠభూమి పొడి అడవులు, అనంతగిరి
కంబాలకొండ అభయారణ్యము, విశాఖపట్నం

భూగర్భ శాస్త్రము[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

  1. Page 46, Dr. Jadoan, Atar Singh (Published September 2001). Military Geography of South-East Asia. India: Anmol Publications Pvt. Ltd. pp. 270 pages. ISBN 8126110082. Retrieved 2008-06-08. Check date values in: |date= (help)
  2. 2.0 2.1 "The Deccan Peninsula". sanctuaryasia. Retrieved 2007-01-05. Cite web requires |website= (help)
  3. 3.0 3.1 "The Deccan Plateau". rainwaterharvesting.org. Retrieved 2007-01-05. Cite web requires |website= (help)
  4. Monier-Williams Sanskrit-English Dictionary, p. 498 (scanned image at SriPedia Initiative): Sanskrit dakṣiṇa meaning 'right', 'southern'.

మూలాలు[మార్చు]

  • Public Domain This article incorporates text from a publication now in the public domainChisholm, Hugh, సంపాదకుడు. (1911). Encyclopædia Britannica (11th సంపాదకులు.). Cambridge University Press. Missing or empty |title= (help)

బయటి లింకులు[మార్చు]