Jump to content

కర్కట రేఖ

వికీపీడియా నుండి
కర్కట రేఖను చూపుతున్న ప్రపంచపటము

భూమధ్య రేఖకు 23° 26′ 22″ ఉత్తరాన ఉన్న అక్షాంశ రేఖను కర్కట రేఖ అంటారు. ఈ కర్కాటక రేఖ భూమి చుట్టూ వున్న వ్యాసం దాదాపు 36,788 కి.మీ. పొడవు వుంటుంది. ఈ రేఖ 16 దేశాల మీద వ్యాపించి ఉంది. ఆయా దేశాల వాతావరణాన్ని బట్టి మార్పులు జరుగుతుంటాయి. మన దేశంలో ఈ రేఖ రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, త్రిపుర, మిజోరంల మీదుగా పయనిస్తున్నది.[1]

చైత్రమాసంలో లేదా మేష మాసంలో భూమధ్యరేఖ మీద ఉన్న సూర్యుడు ఆషాఢ మాసం నాటికి కర్కట రేఖ మీద ప్రవేశిస్తాడు. అప్పటినుంచి ‘దక్షిణం’గా సూర్యుడు జరగడం దక్షిణాయనం.[2]

మూలాలు

[మార్చు]
  1. గర్నెపూడి, సూర్యనారాయణ (2017-06-20). "కర్కాటక రేఖ గురించి..." www.andhrajyothy.com. Archived from the original on 2022-08-19. Retrieved 2020-04-15.[permanent dead link]
  2. "ఉగాది ఇక్కడ.. ఉషస్సు ఎక్కడ..?". andhrabhoomi.net. Archived from the original on 2017-03-24. Retrieved 2020-04-15.
"https://te.wikipedia.org/w/index.php?title=కర్కట_రేఖ&oldid=4322607" నుండి వెలికితీశారు