జమ్మికుంట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?జమ్మికుంట
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°17′21″N 79°28′26″E / 18.2891°N 79.4739°E / 18.2891; 79.4739
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 30.97 కి.మీ² (12 చ.మై)[1]
జిల్లా(లు) కరీంనగర్ జిల్లా
జనాభా
జనసాంద్రత
32,645[2] (2011 నాటికి)
• 1,054/కి.మీ² (2,730/చ.మై)
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం జమ్మికుంట నగర పంచాయతి


జమ్మికుంట, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము ఇది కరీంనగర్ కి 55 కిలో మీటర్స్ లో, వరంగల్ కి 47 కిలో మీటర్స్ లో, హైదరాబాదుకు 182 కిలో మీటర్స్ లో ఉంటుంది, దేశము లోనే వ్యాపార రంగంలో అగ్ర స్తనంలో నిలిచింది, జిల్లా లోనే పెద్ద దైన బ్రిడ్జి జమ్మికుంట లోనే ఉంది, జిల్లా లోనే అతి పెద్ద మార్కెట్ ఇక్కడే ఉంది, గడిచినా 15 ఏళ్లలో 100 దాక పరి శ్రమలు కొలువు తీరాయి రెండు వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి అపర బద్రద్రిగా కిర్తికేక్కిన ఇల్లంతకుంట శ్రీరామ చంద్ర దేవస్తానం జమ్మికుంట మండలం లోనిదే పేరు గాంచిన బిజిగిర్ షరీఫ్ కూడా ఈ మండలం లోనే ఉంది జమ్మికుంటకు 10 కిలో మీటర్ల దూరం విలాసాగర్ లో రైల్వేబ్రిడ్ఘ్ చాల చూడ దగిన ప్రదేశం,

తాగునీటి సమస్య[మార్చు]

జమ్మికుంట పట్టణ ప్రజల కోసం యాభై సంవత్సరాల క్రితం మండలంలోని విలాసాగర్ వాగు నుంచి పైపులైన్ వేసి మానేరు నుంచి నీరందిస్తున్నారు. నాటి జనాభాకు అనుగుణంగా 450 నల్లా కనె క్షన్ల కోసం పైపులైన్ వేశారు. జమ్మికుంట వ్యాపార కేంద్రంగా మారడం, పట్టణ జనాభా పెరగడం వల్ల తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. 2014 నాటికి పట్టణంలో 5,400 నల్లా కనెక్షన్లు ఉండగా.. జనాభా 30 వేలు దాటింది. దీంతో 20 వార్డుల్లో నాలుగురోజుకోసారి నీరందిస్తున్నారు. వేసవిలో నీటికి కటకట తప్పడం లేదు. ప్రజలు వ్యవసాయబావులు, మినరల్‌వాటర్ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు.పిట్టలవాడ, కేశవాపురం, మోత్కులగూడెం, దుర్గాకాలనీ, ఆబాది జమ్మికుంట ప్రాంతాల్లో సరైన పైపులైన్ల నిర్మించకపోవడం వల్ల నీటి కటకటాలు తప్పడం లేదు. [3]

ప్రభుత్వం మరియు రాజకీయాలు[మార్చు]

పౌర పరిపాలన

జమ్మికుంట నగర పంచాయతీ 2011 లో స్థాపించిబడింది. ఈ పట్టణం లోని పరిపాలన వార్డుల సంఖ్య మొత్తం 20. దీని అధికార పరిధి 30.97 km2 (11.96 sq mi).[1]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,03,429 - పురుషులు 52,395 - స్త్రీలు 51,034

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016. 
  2. "Jammikunta Population". Census 2011. Retrieved 14 October 2015. 
  3. "మా‘నీరు’ మహాప్రభో!". Sakshi. 2014-1-20. Retrieved 2014-01-20.  Check date values in: |date= (help)


"https://te.wikipedia.org/w/index.php?title=జమ్మికుంట&oldid=1985113" నుండి వెలికితీశారు