Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

సలాబత్ జంగ్

వికీపీడియా నుండి
సలాబత్ జంగ్
నిజాముల్ ముల్క్
అసఫుద్దౌలా
4వ నిజాం
పరిపాలన13 ఫిబ్రవరి 1751 – 8 జూలై 1762
పూర్వాధికారిముజఫ్ఫర్ జంగ్
ఉత్తరాధికారిమీర్ నిజాం అలీఖాన్, రెండవ అసఫ్‌ఝా
జననం24 నవంబరు 1718
హైదరాబాదు, మొఘల్ సామ్రాజ్యం
(ప్రస్తుత తెలంగాణ, భారతదేశం)
మరణం1763 సెప్టెంబరు 16(1763-09-16) (వయసు 44)
బీదర్ కోట
Burial
వంశము2 కుమారులు
Houseఅసఫ్‌జాహీ వంశము
తండ్రిమొదటి అసఫ్‌ఝా

అసఫ్‌ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ (జ: 1718 - మ: సెప్టెంబరు 16, 1763) హైదరాబాదు నిజాం పాలకుడు. 1751 సంవత్సరంలో ముజఫర్ జంగ్ హత్య తరువాత ఫ్రెంచి సేనాని బుస్సీ, నాసర్ జంగ్ తమ్ముడైన సలాబత్ జంగ్ ను దక్కను సుబేదారుగా ప్రకటించాడు. సలాబత్ జంగ్ దివానైన సయ్యద్ లస్కర్ ఖాన్ దక్కను నుండి ఫ్రెంచి సేనలను తరిమివేయడానికి కుట్రపన్నాడని పసిగట్టిన బుస్సీ 1754లో ఉత్తర సర్కారులు లోని శ్రీకాకుళం, ఏలూరు, రాజమహేంద్రవరం, కొండపల్లి లను సొంత జాగీరుగా సలాబత్ జంగ్ చేత వ్రాయించుకున్నాడు.

సారవంతమైన ఉత్తర సర్కారులు ఫ్రెంచి వారి ఆధీనంలోకి పోవటం వలన హైదరాబాదు రాజ్య ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైనది. మూడవ కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులు ఫ్రెంచి వారిని ఓడించి మచిలీపట్నం స్వాధీనం చేసుకున్నారు. 1759 మే 14 తేదీన సలాబత్ జంగ్ ఆంగ్లేయులతో సంధి చేసుకొని గుంటూరు తప్ప ఉత్తర సర్కారులు అన్నింటిని ఆంగ్లేయుల పరం చేశాడు.

1761లో మొదటి అసఫ్ జా నాలుగవ కుమారుడైన నిజాం ఆలీ ఖాన్ రెండవ అసఫ్‌ఝా బిరుదుతో నిజాం అయ్యాడు. ఇతని కాలం నుండే అసఫ్ జాహీ వంశీయులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధిచెందారు.