అక్షాంశ రేఖాంశాలు: 12°25′15″N 75°44′23″E / 12.4208°N 75.7397°E / 12.4208; 75.7397

మడికేరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?మడికేరి
కర్ణాటక • భారతదేశం
పొగమంచుతో కూడిన రోజు మడికేరి రాజాసనం
పొగమంచుతో కూడిన రోజు మడికేరి రాజాసనం
పొగమంచుతో కూడిన రోజు మడికేరి రాజాసనం
అక్షాంశరేఖాంశాలు: 12°25′15″N 75°44′23″E / 12.4208°N 75.7397°E / 12.4208; 75.7397
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) కొడగు జిల్లా
జనాభా 32,286 (2001 నాటికి)
మేయరు
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 571 201
• +0827
• KA-12


మడికేరి (మెరకర - Mercara) కర్ణాటక రాష్ట్రంలోని పట్టణం. మడికేరి, కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా రాజధాని. కొంతమంది మడికేరిని అంగ్లంలో మెరకర (Mercara) గా పిలుస్తారు.

పట్టణం, పేరు వెనుక కథ

[మార్చు]

1663-1687 సంవత్సరాల మధ్య మడికేరిని పరిపాలించిన హలేరి రాజవంశానికి చెందిన రాజైన ముద్దు రాజ పేరు మీద ముద్దురాజకెరి అని పిలువబడేది. కాలక్రమేణా ఆ పేరు మడికేరిగా మారింది. ఆంగ్లేయుల పరిపాలనలో మెరకరగా కూడా పిలువబడింది.

మడికేరి చరిత్ర

[మార్చు]

మడికేరి చరిత్ర కొడుగు చరిత్రతో ముడిపడి ఉంది. 2వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు కొడగు ఉత్తరభాగం కదంబులచే పాలించబడింది. కొడగు దక్షిణ భాగాన్ని 4వ శతాబ్దము నుండి 11వ శతాబ్దము వరకు గాంగులు పాలించారు. 11వ శతాబ్దంలో గాంగులను ఓడించి, చోళులు కొడగు ప్రాంత పాలకులయ్యారు. 12వ శతాబ్దంలో చోళులు కొడగు ప్రాంతాన్ని హొయసలులకు కోల్పోయారు. 14వ శతాబ్దములో విజయనగర సామ్రాజ్యములో భాగమైనది. విజయనగర సామ్రాజ్య పతనానంతరము స్థానిక పాలెగార్లు ఈ ప్రాంతాన్ని నేరుగా పాలించడం ప్రారంభించారు. వీరిని ఓడించి హలెరి రాజులు కొడగును 1600 నుండి 1834 వరకు పాలించారు. హలెరి రాజులు మడికేరి సమీపాన ఉన్న హలెరిని తమ రాజధానిగా చేసుకున్నారు. హలెరి రాజులలో మూడవ వాడైన ముద్దరాజు మడికేరి పరిసరాలలోని భూమిని చదునుచేసి 1681లో ఒక కోటను నిర్మించాడు. ఈ ప్రాంతానికి ముద్దరాజకెరి అన్న పేరువచ్చింది. అదే ఆ తరువాత కాలములో మడికేరి అయ్యింది. 1834 తరువాత కొడగు బ్రిటీషు పాలన క్రిందకు వచ్చింది.

జనభా లెక్కలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, మడికేరి జనాభా 32,286. అందులో 51% శాతం పురుషులు, 49% స్త్రీలు. మడికేరి సగటు అక్షరాస్యత 81%, ఇది జాతీయ సగటు అయిన 59.5% కంటే చాలా ఎక్కువ. పురుషులలో అక్షరాస్యత 83%, స్త్రీల అక్షరాస్యత 79%. మొత్తం జనాభాలో 11% శాతం 6 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు. మడికేరిలో మాట్లాడే ప్రధాన భాష కొడవ తక్కు. అయితే చాలామంది కొడవతో పాటు రాష్ట్ర అధికార భాష అయిన కన్నడ కూడా మాట్లాడతారు.

మడికేరి, ఒక మంచుతో కూడిన ఉదయం

భౌగోళిక ఉనికి

[మార్చు]

మడికేరి భౌగోళికంగా 12°25′N 75°44′E / 12.42°N 75.73°E / 12.42; 75.73[1] అక్షాంశరేఖాంశాల వద్ద ఉంది. ఇది సముద్రమట్టానికి సగటున 1062 మీటర్లు (3484 అడుగుల) ఎత్తున ఉంది. పశ్చిమ కనుమలలో సముద్రమట్టానికి 1062 అడుగుల ఎత్తున ఉన్న మడికేరి ఒక పేరుపొందిన హిల్ స్టేషను. మడికేరికి పశ్చిమాన మంగుళూరు, తూర్పున మైసూరు, సమీపములోని పెద్ద నగరాలు.

సంస్కృతి

[మార్చు]

మడికేరి కొడవ ప్రజల భూమి. కొడవ ప్రజల పేర్లు ప్రత్యేకముగా ఉండి వారి తెగలపేర్లతో కూడి ఉంటాయి. కొడవ సంస్కృతికి తెగలు కేంద్రబిందువులు. కొడవ కుటుంబాలు తమ వారసత్వాన్ని ఆయా తెగల నుండి నిష్పాదించుకుంటారు. వీరి ఆహార్యము విభిన్నముగా ఉంటుంది. పురుషులు చుట్టూ చుట్టుకొనే కుప్యా అనే వస్త్రాలను ధరిస్తారు (ప్రస్తుతం ఇవి సాంప్రదాయ సందర్భాలకే పరిమతమైనవి). అడవారు ఒక ప్రత్యేకమైన శైలిలో చీరలను ధరిస్తారు. కొడవ స్త్రీలు చీర కుచ్చిల్లు వెనుకవైపుకు ఉండే విధంగా ధరిస్తారు. వీరికి కత్తులు ధరించడము, యుద్ధ విన్యాసాలతో కూడిన నృత్యాలు చేయటం మొదలైన విభిన్న సాంప్రదాయక ఆచార వ్యవహారాలు అనేకం ఉన్నాయి. త్రాగటం, నృత్యం చెయ్యటం, మాంగోస్టీన్ తో కూడిన మాంసాహార వంటకాలు ప్రధాన ఆకర్షణలుగా కల సముదాయము మొత్తం గుమిగూడే సందర్భాలు కూడా కొడవల సంస్కృతిలో భాగమే.

మడీకేరి స్థూల దృశ్యం

ప్రముఖులు

[మార్చు]

మడికేరి చేరుకొనే విధానం

[మార్చు]

రోడ్డు ద్వారా

[మార్చు]

కర్ణాటక రాష్ట్ర రహదారి 88 మంగళూరు నుండి మైసూరు వెళ్ళే మార్గంలో మడికేరి వస్తుంది. మడికేరి మంగళూరు నుండి 136 కి.మీ. దూరంలో, మైసూరుకు 120 కి.మీ.దూరంలో ఉంది.కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి మడికేరి చేరుకోవడానికి రాష్ట్ర రహదారి 17 (బెంగళూరు- మైసూర్) మీద శ్రీరంగపట్టణం వరకు ప్రయాణించి అక్కడ నుండి రాష్ట్ర రహదారి 88 మీద వెళ్ళితే మడికేరి వస్తుంది. బెంగళూరు-మడికేరి దూరం 252 కి.మీ. హసన్‌ 115 కి.మీ దూరంలో ఉంది. కేరళ రాష్ట్రంలోని కణ్ణూరు, తెల్లచెర్రి 115 కి.మీ దూరంలో ఉన్నాయి.

రైలు ద్వారా

[మార్చు]

మడికేరికి రైలు స్టేషను‌ లేదా రైలు సౌకర్యం లేదు. దగ్గరలో రైలు సౌకర్యం ఉన్న పట్టణాలు హసన్‌, కేరళలోని కణ్ణూరు, తెల్లిచెర్రి. (ఈ పట్టణాలు సుమారుగా 115 కి.మీ. దూరంలో ఉన్నాయి. మంగళూరు, మైసూరు కూడా సుమారుగా అంతే దూరంలో ఉన్నాయి.

విమాన సౌకర్యం

[మార్చు]

మడికేరికి విమానశ్రయ సౌకర్యం లేదు. మడికేరికి దగ్గరలో ఉన్న విమానశ్రయం మంగళూరు 136 కి.మీ దూరంలో ఉంది. మైసూరు విమానశ్రయం ఇప్పుడు అధునికరించబడుతున్నది. ఆధునీకరణ పూర్తి అయ్యినతరువాత మైసూరు విమానశ్రయం దగ్గరి విమానసౌకర్యం కల్పించే నగరం అవుతుంది. బెంగళూరు విమానశ్రయం చివరి పక్షంలో వినియోగించుకోవచ్చు.

ఇంకా చూడవలసిన ప్రదేశాలు

[మార్చు]
అబ్బె జలపాతం, మడికేరి పర్యాటక ఆకర్షణ
  • రాజాసనం: మడికేరి పట్టణ కేంద్రం పశ్చిమ భాగంలో ఒక చిన్న ఉద్యానవనంలోని అరుగు. ఈ అరుగు నుండి చూస్తే పట్టణపు లోయ రమణీయంగా కనిపిస్తుంది.
  • బొమ్మ రైలు: పట్టణ కేంద్రంలో ఉన్న ఈ బొమ్మ రైలు (నడిచే) ని పర్యాటకులు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎక్కి ఆనందాన్ని పొందుతారు.
  • మడికేరి కోట:17వ శతాబ్దం చివరిలో ముద్దురాజ ఈ కోట నిర్మాణం జరిపాడు. ఈ కోట లోపల పెద్ద రాజ భవంతి ఉంది. ఈ కోటను టిప్పు సుల్తాను గ్రానైటుతో పునరుద్ధరించి జఫరాబాద్‌ అని పేరు పెట్టాడు. 1790లో దొడ్డవీర రాజేంద్ర ఈ కోట మీద అధికారం సంపాదించాడు. 1812-1314 సంవత్సరాల మధ్య లింగరాజేంద్ర వడియార్‌ మళ్ళీ పునరుద్ధరించాడు. 1834 సంవత్సరానికి ఈ కోట అజమాయిషీ బ్రిటిష్‌ వారి చేతులలోకి వెళ్ళింది. ఈశాన్య మూలనుందు రెండు పెద్ద పెద్ద రాతి మీద చెక్కబడిన ఏనుగులు ఉన్నాయి. ఆగ్నేయ మూలనందు ఒక చర్చి ఉంది.
  • అబ్బె జలపాతం: మడికేరికి 10 కి.మీ దూరంలో ఉన్న ఈ అబ్బే జలపాతాలు చాలా రమణీయంగా ఉంటాయి. కావేరి నది కొండలపై నుండి లోయలోకి పడుతూ ఈ జలపాతంగా మారుతోంది. వ్రేలాడే వంతెన నిర్మాణం ఇటీవల కాలంలో జరిగింది. ఈ వ్రేలాడె వంతెన వల్ల జలపాతం సౌందర్యం ఆస్వాదించడానికి చాలా మంచి అవకాశం దొరుకుతొంది. మడికేరి నుండి ఈ జలపాతాన్ని సన్నటి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రదేశం అంతా పైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంది. వాహనాలు నిలిపినందుకు పన్ను కట్టవలసి ఉంటుంది. వాహనాలు నిలిపే స్థలం నుండి కొంతమేర మెట్ల మీద నడిస్తే అబ్బే జలపాతం దర్శించే అవకాశం కలుగుతుంది.
  • టిబెట్టియన్ కాలని: మడికేరి నుండి కమలానగర్ చేరుకొన్న తరువాత అక్కడ నుండి ప్రక్క రోడ్డులో ప్రయాణిస్తే బౌద్ధుల కేంద్రం అయిన టిబెట్టియన్‌ కాలనీ కనిపిస్తుంది. మార్గమధ్యంలో టిబెట్టియన్ల ప్రధానాహారమైన మొక్కజొన్న చేలు కనిపిస్తాయి.

మూలాలు

[మార్చు]

వెలుపలి లెంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మడికేరి&oldid=4308586" నుండి వెలికితీశారు