దుబ్బాక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?దుబ్బాక
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°51′06″N 78°40′58″E / 17.8517°N 78.6828°E / 17.8517; 78.6828
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 26.40 కి.మీ² (10 చ.మై)[1]
జిల్లా(లు) సిద్దిపేట జిల్లా
జనాభా
జనసాంద్రత
2,978[2] (2011 నాటికి)
• 113/కి.మీ² (293/చ.మై)
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం దుబ్బాక పురపాలక సంఘము


దుబ్బాక (ఆంగ్లం: Dubbak or Dubbaka), తెలంగాణ రాష్ట్రములోని సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక పట్టణం.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) [2] 
మొత్తం - 12,349; పురుషులు - 6,071 35,324; స్త్రీలు - 6,278

పేరువెనుక చరిత్ర[మార్చు]

పూర్వం అన్ని రకాల వ్యాధులకీ ఆకుపసర్లను వాడేవారు. అటువంటి ఆకుల్లో అత్యుత్తమమైన అమోఘమైన ఆకు ఇక్కడుండేదట! పూర్వం అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆంజనేయుడు మోసుకొచ్చిన రకరకాల వనమూలికల చెట్టున్న సంజీవినీ పర్వంతపై నుంచి ఆయనొచ్చిన గాలివేగానికి ఓ మొక్క ఎగిరి ఇక్కడ పడింది. ఆ మొక్క దుబ్బుగా ఉండేది. ఎటువంటి రోగానికైనా ఈ ఆకుపసరు పూస్తే వ్యాధి ఇట్టే మాయమై పోయేదట! దాంతో ఈ ప్రాంతాన్ని అదే పేరుతో దుబ్బాకగా పిలుస్తున్నారు.

మరియు దీనికి ఇంకొక పేరు కూడా ఉంది అదే "దుర్వాస "

కొత్త మంది ఊరికి తూర్పు వైపు దుర్వాస అని పశ్చిమ వైపు దుబ్బాక అనే వారు

కానీ పూర్వం ఇక్కడ దుర్వాస మహర్షి తపస్సు చేసాడు అందుకే దీనికి దుర్వాస అనే పేరు వచ్చింది

దుబ్బాక గురించి

ఈ ఊరిలో "అయోధ్య రామ హిందూ సేన" అనే యువ హైందవ సమూహం ఉంది ఇది చాల శక్తివంతమైంది ఇది వివేకానంద స్ఫూర్తికి చిహ్నంగా రామ జన్మ భూమికి సైనికులుగా భారత మాతకి బిడ్డలుగా హైందవ వీరులకి వారసులుగా సంస్కృతి కాపాడే వాడికి అండగా మత మార్పిడికి పాల్పడే వాళ్ళ గుండెల్లో సింహంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనిచారులుగా నిర్మించబడింది

ఈ గ్రామంలో జరిగే వినాయక ఉత్సవాలకు ప్రత్యేకమైన పేరు ఉంది. దాదాపు అరవై యువజన సంఘాల వారు ఈ ఉత్సవంలో పాల్గోంటారు.. చివరన నిమజ్జన మహోత్సవానికి చాలా ప్రత్యేకత ఉంది. దానిని చూడటానికి ఇతర ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు...

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు[మార్చు]

 1. "Basic Information of Municipality". Municipal Administration & Urban Development Department. Retrieved 29 June 2016. 
 2. 2.0 2.1 "Census 2011" (PDF). Census of India 2011. p. 172. Retrieved 29 June 2016. 

దుబ్బాక మండలము లోని గ్రామములు[మార్చు]

 1. ఆకారం
 2. అప్పనపల్లి
 3. ఆరెపల్లి
 4. బల్వంతాపూర్
 5. బొప్పాపూర్
 6. చీకోడు (పెద్ద)
 7. చేర్వాపూర్
 8. చెల్లాపూర్
 9. చిట్టాపూర్
 10. చౌదర్ పల్లి
 11. ధర్మాజీపేట
 12. దుబ్బాక
 13. దుంపలపల్లి
 14. ఎనగుర్తి
 15. గంభీర్ పూర్
 16. గోసాన్ పల్లి
 17. హబ్షీపూర్
 18. హసన్ మీరాపూర్
 19. లచ్చపేట
 20. మల్లాయపల్లి
 21. పద్మనాభునిపల్లి
 22. పెద్దగుండవెళ్ళి
 23. పోతారం
 24. పోతారెడ్డిపేట
 25. రఘోత్తంపల్లి
 26. రాజక్కపేట
 27. రామక్కపేట
 28. రామేశ్వరం పల్లి
 29. శివరాంపూర్
 30. శిలాజీనగర్
 31. తిమ్మాపూర్
 32. యెల్లాపూర్
"https://te.wikipedia.org/w/index.php?title=దుబ్బాక&oldid=2140621" నుండి వెలికితీశారు