నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం
(నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2020 87 నాగార్జునసాగర్ జనరల్ నోముల భగత్ కుమార్ పు తెలంగాణ రాష్ట్ర సమితి 80000 కుందూరు జానారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 72000 2018 87 నాగార్జునసాగర్ జనరల్ నోముల నర్సింహయ్య పు తెలంగాణ రాష్ట్ర సమితి 80000 కుందూరు జానారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 62484 2014 87 నాగార్జునసాగర్ జనరల్ కుందూరు జానారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 69684 నోముల నర్సింహయ్య పు తెలంగాణ రాష్ట్ర సమితి 53208 2009 87 నాగార్జునసాగర్ జనరల్ కుందూరు జానారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 67958 తేరా చిన్నపరెడ్డి M తె.దే.పా 61744
2009 ఎన్నికలు[మార్చు]
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పి.చిన్నపరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున కుందూరు జానారెడ్డి, ప్రజారాజ్యం నుండి రామచంద్రనాయక్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్, లోక్‌సత్తా తరఫున టి.రజనీకాంత్ పోటీచేశారు.[1]
ఫలితాలిలా ఉన్నాయి [1]
క్ర.సం. | అభ్యర్థి | పార్టీ | వోట్లు |
---|---|---|---|
1 | కుందూరు జానారెడ్డి | కాంగ్రెస్ | 67958 |
2 | తెర చిన్నప్పరెడ్డి | తె.దే.పా. | 61744 |
3 | ఇస్లావత్ రామచందర్ నాయక్ | ప్రజారాజ్యం పార్టీ | 8600 |
4 | కట్టా యాదయ్య | బహుజన్ సమాజ్ పార్టీ | 4639 |
5 | బొలిగొర్ల శ్రీనివాస యాదవ్ | భా.జ.పా. | 1773 |
6 | చెరక మల్లికార్జున గౌడ్ | బి.సి. యునైటెడ్ ఫ్రంట్ | 1229 |
7 | జి. రతన్ కుమార్ | స్వతంత్ర | 1180 |
8 | నిమ్మల ఇందిర | స్వతంత్ర | 992 |
9 | ధనవత్ శ్రీనివాస నాయక్ | స్వతంత్ర | 867 |
10 | వడ్లమూడి సౌదామిని | స్వతంత్ర | 754 |
11 | తేర రజనీకాంత్ | లోక్ సత్తా పార్టీ | 713 |
12 | పి. రామలింగారెడ్డి | పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | 633 |
13 | జూలకంటి వెంకటేశ్వరరెడ్డి | స్వతంత్ర | 582 |
14 | జక్కుల చిననరసింహ | స్వతంత్ర | 495 |
15 | ఉడుతూరి విష్నువర్ధన్ రెడ్డి | స్వతంత్ర | 450 |
16 | జక్కల వెంకటేశ్వర్లు | స్వతంత్ర | 434 |
17 | మాలోతు కోట్యానాయక్ | ప్రజాశాంతి పార్టీ | 392 |
18 | గంటెకపు వెంకటయ్య | స్వతంత్ర | 374 |
19 | కనకరాజు సామేలు | స్వతంత్ర | 333 |
20 | విరిగినేని అంజయ్య | స్వతంత్ర | 272 |
నియోజకవర్గ ప్రముఖులు[మార్చు]
- కె.జానారెడ్డి
- 1975లో రాజకీయరంగ ప్రవేశం చేసిన జానారెడ్డి 1978లో జయప్రకాశ్ నారాయణ్ స్పూర్తితో జనతాపార్టీ తరఫున పోటీచేసి నిమ్మల రాములు చేతిలో ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం తరువాత ఆ పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1988లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ప్రత్యేకంగా తెలుగునాడు పార్టీ స్థాపించాడు. ఆ మరుసంవత్సరమే తెలుగునాడును కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, కాంగ్రెస్ తరఫున పోటీచేసి శాసనసభకు ఎన్నికైనాడు. 1994లో కాంగ్రెస్ తరఫునే పోటీచేసి రామ్మూర్తి యాదవ్ చేతిలో పరాజయం పొందినాడు. ఆ తరువాత 1999, 2004 ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులు పొందినాడు. గతంలో సినిమాటోగ్రఫి, వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేసిన జానా రెడ్డి ప్రస్తుతం హోంశాఖను నిర్వహిస్తున్నాడు.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ సాక్ష్ దినపత్రిక, తేది 09-04-2009