Jump to content

ఇస్లావత్ రామ్‌చందర్ నాయక్

వికీపీడియా నుండి
(ఇస్లావత్ రామచందర్ నాయక్ నుండి దారిమార్పు చెందింది)
ఇస్లావత్ రామ్‌చందర్ నాయక్
ఇస్లావత్ రామ్‌చందర్ నాయక్


తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ
పదవీ కాలం
2022 ఆగస్టు 4 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1966 ఏప్రిల్ 10
సత్యపహడ్ తండ, త్రిపురారం మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి ఇస్లావత్ కల్పనా
సంతానం పల్లవి, కేతన్

ఇస్లావత్ రామ్‌చందర్ నాయక్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2022 ఆగస్టు 4న తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించబడ్డాడు.[1]

జననం, విద్య

[మార్చు]

రామ్‌చందర్ నాయక్ 1966 ఏప్రిల్ 10న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, త్రిపురారం మండలంలోని సత్యపహడ్ తండలో జన్మించాడు. హైదరాబాదు విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ లో ఎంఏ పూర్తిచేశాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రామ్‌చందర్ నాయక్ కు కల్పనతో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (పల్లవి), ఒక కుమారుడు (కేతన్) ఉన్నారు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

1987-1992 మధ్యకాలంలో ఎంపిపి అధ్యక్షుడిగా పనిచేసిన రామ్‌చందర్ నాయక్, 2001-2006 మధ్యకాలంలో నల్గొండ జిల్లా జెడ్.పి.టి.సిగా, జెడ్.పి. ఫ్లోర్ లీడర్‌గా పనిచేశాడు. సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో పనిచేశాడు. 1998లో జరిగిన ఎంపి ఎన్నికలలో మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపిగా, ప్రజారాజ్యం పార్టీ తరపున 2009లో నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీచేశాడు. నల్గొండ జిల్లా రాజకీయాల్లో పలు పదవులను నిర్వర్తించిన రామ్‌చందర్ నాయక్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కీలకంగా వ్యవహరించటంతోపాటు టీఆర్‌ఎస్‌ ఎస్టీ సెల్‌లో సుదీర్ఘకాలం పనిచేశాడు.

ఇతర విషయాలు

[మార్చు]

ఆలిండియా బంజారాసేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, నల్లగొండ జిల్లా రైతుబంధు సమితి కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (2022-08-04). "రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా రామచందర్ నాయక్". Archived from the original on 2022-08-04. Retrieved 2022-08-04.
  2. Sakshi (28 March 2014). "ఎంపీపీలుగా.. జెడ్పీటీసీలుగా." Archived from the original on 2022-08-04. Retrieved 2022-08-04.
  3. CEO Telangana (2009). "Islavath Ramchander Naik Affidavit" (PDF). Archived from the original (PDF) on 2022-08-04. Retrieved 2022-08-04.