వేముల వీరేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేముల వీరేశం
వేముల వీరేశం


ఎమ్మెల్యే
పదవీ కాలము
2014-
నియోజకవర్గము నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జీవిత భాగస్వామి పుష్పలత
సంతానము విపుల్ కుమార్, వినూత్న
మతం Hindu

వేముల వీరేశం తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు. నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జననం[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా, శాలిగౌరారం మండలం ఉట్కూర్ గ్రామంలో వేముల కొండయ్య, మల్లమ్మ దంపతులకు జన్మించారు.[1]

విద్యాభ్యాసం[మార్చు]

పాఠశాల విద్యను మాధవరం కలాన్ పూర్తిచేసిన వీరేశం, నకరేకల్ ఇంటర్మీడియట్, డిగ్రీ చదివారు. పాఠశాల స్థాయినుండే విద్యార్థి సంస్థైన పి.డి.ఎస్.యు. కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి, అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై గెలుపొందారు. వెనుకబడిన కుటుంబం నుండి వచ్చిన వీరేశం తన నియోజకవర్గంలోనే ఉంటూ పేదల సమస్యలు తెలుసుకొని వాటిని తీరుస్తున్నారు. మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సహాయంతో వలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.[2][3]

మూలాలు[మార్చు]