చిరుమర్తి లింగయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిరుమర్తి లింగయ్య
చిరుమర్తి లింగయ్య


పదవీ కాలం
2009 - 2014, 2018 - ప్రస్తుతం
ముందు వేముల వీరేశం
నియోజకవర్గం నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1973, ఏప్రిల్ 20
బ్రాహ్మణ వల్లెంల, నార్కెట్‌పల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు నర్సింహ - మారమ్మ
జీవిత భాగస్వామి పార్వతమ్మ
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె

చిరుమర్తి లింగయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున నకిరేకల్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]

జననం, విద్య

[మార్చు]

లింగయ్య 1973, ఏప్రిల్ 20న నర్సింహ[3] - మారమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నార్కెట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వల్లెంల గ్రామంలో జన్మించాడు. 1990లో స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

లింగయ్యకు పార్వతమ్మతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

2009లో నకిరేకల్ ఎస్‌సి నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ టిక్కెట్టుపై పోటిచేసి సిపియం అభ్యర్థి మామిడి సర్వయ్యపై గెలుపొందాడు.[4] 2011లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసాడు. 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి పోటీచేసి తెరాస అభ్యర్థి వేముల వీరేశం చేతిలో ఓడిపోయాడు.

2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి వేముల వీరేశం పై 8259 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] ఈ ఎన్నికల్లో చిరుమర్తికి టిక్కెట్ ఇప్పించేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాలరెడ్డి, కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో పోరాడాల్సి వచ్చింది. లింగయ్యకు టిక్కెట్ ఇవ్వకపోతే తామూ పోటీ చేయమని పట్టుపట్టి మరీ ఆయనకు టిక్కెట్టు ఇప్పించారు.[6][7] అయితే ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే లింగయ్య కాంగ్రెసు పార్టీని వదిలి, తెరాసలో చేరాడు.[8]

హోదాలు

[మార్చు]
  • 1995: ఎంపిటిసి
  • 2001-2006: జెడ్పిటిసి

ఇతర వివరాలు

[మార్చు]

చైనా, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సందర్శించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Another Congress Lawmaker In Telangana To Join KCR's Party". NDTV.com. Retrieved 2021-09-21.
  2. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  3. Namasthe Telangana (18 April 2022). "ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పితృవియోగం". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  4. "Andhra Pradesh News : CPI (M) faces acid test in its bastion". The Hindu. 2009-04-15. Archived from the original on 2009-04-18. Retrieved 2013-08-04.
  5. "Chirumarthi Lingaiah(Indian National Congress(INC)):Constituency- NAKREKAL (SC)(NALGONDA) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-21.
  6. "ఆయనకు టికెట్‌ రాకపోతే.. నేను పోటీ చేయను..!". సాక్షి. 2018-11-09. Archived from the original on 2020-07-03. Retrieved 2020-07-03.
  7. "కాంగ్రెస్‌కు మరో షాక్.. టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య?". Samayam Telugu. Archived from the original on 2020-07-03. Retrieved 2020-07-03.
  8. "కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. టీఆర్‌ఎస్‌లోకి మరో ఎమ్మెల్యే". సాక్షి. 2019-03-09. Archived from the original on 2020-07-03. Retrieved 2020-07-03.