బద్దం బాల్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బద్దం బాల్‌రెడ్డి

3 సార్లు శాసన సభ్యులు
నియోజకవర్గము కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

బద్దం బాల్‌రెడ్డి హైదరాబాదుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. విద్యార్థి దశలొనే ఉద్యమాలలో పనిచేసి, ఆ తర్వాత జనసంఘ్ లో చేరారు. 1977లో జనసంఘ్ నేతలతో పాటు జనతాపార్టీలో చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆయన రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగారు. 1985 నుంచి 1994 వరకు 3 సార్లు కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. నియోజకవర్గ ప్రజలచే కార్వాన్ టైగర్‌గా పిలుపించుకున్నారు. 1991, 1998, 1999లలో హైదరాబాదు లోకసభ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు.

కాబా సంఘటన

1979లో బద్దం బాల్‌రెడ్డి ఇంటికి వెళ్ళుచుండగా శాలిబండవద్ద కొందరు దుండగులు కత్తులు, రాళ్ళతో దాడిచేసి చనిపోయాడని భావించి వదిలివెళ్ళారు. స్థానికులు గుర్తించి అతనిని రక్షించారు.