షా ఆలీ బండ
షా ఆలీ బండ
షాలిబండ | |
---|---|
నగరప్రాంతం | |
Coordinates: 17°21′N 78°28′E / 17.35°N 78.47°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 065 |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | చార్మినార్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
షా ఆలీ బండ (షాలిబండ), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక భాగం. ఇది నగర పాతబస్తీలోని చార్మినార్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ షా అలీ బండ క్లాక్ టవర్ ఉంది. 1904లో రాజారాయ్ రాయన్ ఈ గడియారాన్ని ప్రతిష్ఠించాడు.[1]
చరిత్ర
[మార్చు]కుతుబ్‍షాహీల కాలంలో షా అలీ ఒక సూఫీ ఫకీరు ఈ ప్రాంతంలోని రావి చెట్టు కింద అతని నివాసం ఉండేవాడు. అతడు చనిపోయిన తరువాత ఆ చెట్టు క్రిందనే అతని దర్గా (సమాధి) వెలిసింది. ఆవిధంగా ఈ ప్రాంతానికి షాలిబండ అన్న పేరు వచ్చింది. కుతుబ్‍షాహీల పరిపాలన తర్వాత ఆసఫ్‍జాహీ - నిజాంల పరిపాలనా కాలంలో ఈ ప్రాంతం ప్రభుత్వ కార్యకలాపాలకు ఒక ముఖ్య కేంద్రంగా ఉండేది. అలాగే ఉన్నతోద్యోగుల కార్యాలయాలు, నివాసాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉండేవి.[2]
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో షా అలీ బండ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో ఉప్పుగూడ, యాకుత్‌పురాలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
దేవాలయాలు
[మార్చు]ఇక్కడ 17వ శతాబ్దంలో నిర్మించిన అక్కన్న మాదన్న మహాకాళి గుడి ఉంది. 1998 లో సంఘ వ్యతిరేక శక్తుల మూలంగా ఈ దేవాలయం పై దాడులు చేయబడ్డాయి. దీని మూలంగా విగ్రహం, దేవాలయం నాశనం జరిగింది.[3]
మత అల్లర్లు
[మార్చు]మత అల్లర్లతో సమస్యలను ఎదుర్కొంటున్న పాతబస్తీ చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్నిసార్లు పోలీసులు కర్ఫ్యూలు విధిస్తుంటారు.[4] 1992లో, ఈ ప్రాంతంలో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనులు పునారావృతమయితే, చాలా తీవ్రమైన పరిస్థితులలో విద్యుత్తు కోతలు నిర్వహించబడతాయి, పోలీసులు నగరాన్ని పూర్తిగా మూసివేస్తారు.[5]
రెస్టారెంట్లు
[మార్చు]ఇక్కడ అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. పిస్తా హౌస్, షా గౌస్ కేఫ్ మొదలైన రెస్టారెంట్లలో హైదరాబాదీ వంటకాలు లభిస్తున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ ‘పట్నంలో షాలిబండ పేరైనా గోలుకొండ’ అని పాడుకునే పాత రోజులు మళ్లీ వస్తాయా?, పరవస్తు లోకేశ్వర్, షహర్ నామా (హైద్రాబాద్ వీధులు – గాథలు)
- ↑ దక్కన్ లాండ్, హైదరాబాదు (1 October 2020). "పట్నంలో షాలిబండా". www.deccanland.com. పరవస్తు లోకేశ్వర్. Archived from the original on 14 జనవరి 2021. Retrieved 14 January 2021.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-02-04. Retrieved 2014-10-03.
- ↑ Hareesh, P (30 March 2010). "Hyderabad slides into Stone Age". The New Indian Express. Archived from the original on 31 మే 2016. Retrieved 14 January 2021.
- ↑ Vudali, Srinath (1 April 2010). "Problems multiply on Day 2". The New Indian Express. Archived from the original on 31 మే 2016. Retrieved 14 January 2021.