అక్కన్న మాదన్న మహాకాళి గుడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
AKKANNA MADANNA TEMPLE
అక్కన్న మాదన్న మహాకాళి గుడి
AKKANNA MADANNA TEMPLE అక్కన్న మాదన్న మహాకాళి గుడి is located in Telangana
AKKANNA MADANNA TEMPLE అక్కన్న మాదన్న మహాకాళి గుడి
AKKANNA MADANNA TEMPLE
అక్కన్న మాదన్న మహాకాళి గుడి
తెలంగాణ లో ప్రాంతం
భౌగోళికాంశాలు:17°22′31″N 78°28′28″E / 17.37528°N 78.47444°E / 17.37528; 78.47444Coordinates: 17°22′31″N 78°28′28″E / 17.37528°N 78.47444°E / 17.37528; 78.47444
పేరు
స్థానిక పేరు:అక్కన్న మాదన్న మహాకాళి గుడి
స్థానము
దేశము:భారత దేశము
రాష్ట్రము:తెలంగాణ
ప్రదేశము:షాలిబండ వద్ద, హైదారాబాదు
నిర్మాణశైలి మరియు సంస్కృతి
ప్రధానదైవం:మహాకాళి
ప్రధాన పండుగలు:బోనాలు
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణము)
17 వశతాబ్దం
నిర్మాత:మాదన్న మరియు అక్కన్న
వెబ్‌సైటు:akkannamadannatemple.com

అక్కన్న మాదన్న మహాకాళి గుడి భారతదేశములోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదునందు గల హిందూ దేవాలయం.[1] ఈ దేవాలయం జంటనగరాలైన హైదరాబాదు మరియు సికింద్రాబాదులలో జరిపే ప్రసిద్ధ పందగ బోనాలుకు ప్రసిద్ధి చెందినది.[2] ఈ దేవాలయం బోనాలు పండగలలో ఘటాల ఊరేగింపుకు ప్రసిద్ధి చెందినది.

చరిత్ర[మార్చు]

17 వ శతాబ్దంలో హైదరాబాదు తానీషా పరిపాలనలో ఉండేది. ఆయన గోల్కొండ కోటకు చక్రవర్తిగా ఉండేవారు. ఆయన రాజ్యంలో అనేక మంది మంత్రులు ఉండేవారు. వారిలో ముఖులు అక్కన్న, మాదన్నలు. వారిలో ఒకరు సైనికాధికారిగానూ మరొకరు ప్రధాన మంత్రిగానూ ఉండేవారు. ఈ సోదరులు రాజాస్థానంలో ముఖ్యమైన మంత్రులుగా ఉండేవారు. వారు ఈ దేవాలయం ప్రాంతంలో నివసించేవారు. వీరు మహాకాళీ యొక్క భక్తులు. వారు ప్రతిరోజు ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. వారు పూజలు చేసిన తర్వాతనే రాజాస్థానానికి (గోల్కొండ) కు హాజరయ్యేవారు. వారు హతులైన తర్వాత ఈ దేవాలయం మూయబడింది.

67 సంవత్సరాల తర్వాత ఈ దేవాలయం సాలిబండ వద్ద పునః ప్రారంభించబడింది. ఈ దేవాలయం ప్రారంభించిన తర్వాత అతి కొద్దిమంది పాత నగరం ప్రజలు వెళ్ళేవారు. ప్రస్తుతం ఈ దేవాలయం అతి ప్రసిద్ధి చెందిన మహాకాళీ ఆలయంగా కొనియాడబడుతుంది.

1998 దాడులు[మార్చు]

1998 లో సంఘ వ్యతిరేక శక్తుల మూలంగా ఈ దేవాలయం పై దాడులు చేయబడ్డాయి. దీని మూలంగా విగ్రహం మరియు దేవాలయం నాశనం జరిగింది.[3]

=ఇవి కూడా చూడండి[మార్చు]

అక్కన్న మరియు మాదన్న గుహాలయాలు]]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]