షా ఆలీ బండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షా ఆలీ బండ

షాలిబండ
నగరప్రాంతం
షా ఆలీ బండ is located in Telangana
షా ఆలీ బండ
షా ఆలీ బండ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
నిర్దేశాంకాలు: 17°21′N 78°28′E / 17.35°N 78.47°E / 17.35; 78.47Coordinates: 17°21′N 78°28′E / 17.35°N 78.47°E / 17.35; 78.47
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 065
లోకసభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంచార్మినార్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

షా ఆలీ బండ (షాలిబండ), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక భాగం. ఇది నగర పాతబస్తీలోని చార్మినార్ కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ షా అలీ బండ క్లాక్ టవర్ ఉంది. 1904లో రాజారాయ్‍ రాయన్‍ ఈ గడియారాన్ని ప్రతిష్టించాడు.[1]

చరిత్ర[మార్చు]

కుతుబ్‍షాహీల కాలంలో షా అలీ ఒక సూఫీ ఫకీరు ఈ ప్రాంతంలోని రావి చెట్టు కింద అతని నివాసం ఉండేవాడు. అతడు చనిపోయిన తరువాత ఆ చెట్టు క్రిందనే అతని దర్గా (సమాధి) వెలిసింది. ఆవిధంగా ఈ ప్రాంతానికి షాలిబండ అన్న పేరు వచ్చింది. కుతుబ్‍షాహీల పరిపాలన తర్వాత ఆసఫ్‍జాహీ - నిజాంల పరిపాలనా కాలంలో ఈ ప్రాంతం ప్రభుత్వ కార్యకలాపాలకు ఒక ముఖ్య కేంద్రంగా ఉండేది. అలాగే ఉన్నతోద్యోగుల కార్యాలయాలు, నివాసాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉండేవి.[2]

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో షా అలీ బండ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో ఉప్పుగూడ, యాకుత్‌పురాలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

దేవాలయాలు[మార్చు]

ఇక్కడ 17వ శతాబ్దంలో నిర్మించిన అక్కన్న మాదన్న మహాకాళి గుడి ఉంది. 1998 లో సంఘ వ్యతిరేక శక్తుల మూలంగా ఈ దేవాలయం పై దాడులు చేయబడ్డాయి. దీని మూలంగా విగ్రహం, దేవాలయం నాశనం జరిగింది.[3]

మత అల్లర్లు[మార్చు]

మత అల్లర్లతో సమస్యలను ఎదుర్కొంటున్న పాతబస్తీ చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్నిసార్లు పోలీసులు కర్ఫ్యూలు విధిస్తుంటారు.[4] 1992లో, ఈ ప్రాంతంలో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనులు పునారావృతమయితే, చాలా తీవ్రమైన పరిస్థితులలో విద్యుత్తు కోతలు నిర్వహించబడతాయి, పోలీసులు నగరాన్ని పూర్తిగా మూసివేస్తారు.[5]

రెస్టారెంట్లు[మార్చు]

ఇక్కడ అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. పిస్తా హౌస్, షా గౌస్ కేఫ్ మొదలైన రెస్టారెంట్లలో హైదరాబాదీ వంటకాలు లభిస్తున్నాయి.

మూలాలు[మార్చు]

  1. ‘పట్నంలో షాలిబండ పేరైనా గోలుకొండ’ అని పాడుకునే పాత రోజులు మళ్లీ వస్తాయా?, పరవస్తు లోకేశ్వర్‍, షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు)
  2. దక్కన్ లాండ్, హైదరాబాదు (1 October 2020). "పట్నంలో షాలిబండా". www.deccanland.com. పరవస్తు లోకేశ్వర్‍. Retrieved 14 January 2021. CS1 maint: discouraged parameter (link)
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-02-04. Retrieved 2014-10-03.
  4. Hareesh, P (30 March 2010). "Hyderabad slides into Stone Age". The New Indian Express. Retrieved 14 January 2021.
  5. Vudali, Srinath (1 April 2010). "Problems multiply on Day 2". The New Indian Express. Retrieved 14 January 2021.