కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
కొల్లాపూర్ | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా ఇదివరకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కొన్ని గ్రామాలు కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కలిశాయి. 1952 నుండి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 7 సార్లు విజయం సాధించగా, [1] 3 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందినారు. తెలుగుదేశం పార్టీ, కమ్యూనిష్టులు ఒక్కోసారి విజయం పొందినాయి.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]
నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]
- 2001 లెక్కల ప్రకారము జనాభా: 2,45,766.
- ఓటర్ల సంఖ్య (ఆగస్టు 2008 నాటికి) : 2,17,368.[2]
- ఎస్స్టీ, ఎస్టీల శాతం: 18.42%, 6.40%.
నియోజకవర్గపు చరిత్ర[మార్చు]
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పటి నుండి జరిగిన 12 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 సార్లు విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ.లు ఒక్కొక్క సారి గెలుపొందినాయి. 1952లో జరిగిన మొదటి ఎన్నికలలో కమ్యూనిష్టుల మద్దతుతో పి.డి.ఎఫ్. అభ్యర్థి గెలువగా, 1957లో విజయం సాధించిన నర్సింగరావు మంత్రివర్గంలో స్థానం పొందినాడు. 1962లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.రంగదాసు విజం సాధించాడు. 1967లో కూడా మళ్ళీ కాంగ్రెస్ టికెట్టు రంగదాసుకే లభించగా కాంగ్రెస్ పార్టీ వారే వ్యతిరేకించి ఇండిపెండెంట్ అభ్యర్థి నర్సింహారెడ్డిని గెలుపించుకున్నారు. 1972లో రంగదాసుకు టికెట్టు లభించకున్ననూ ఇండిపెండెంట్‌గా పోటీకి దిగి విజయం సాధించాడు. 1978, 83, 85 లలో కొత్త వెంకటేశ్వరరావు వరసగా మూడు సార్లు గెలిచి హాట్రిక్ సాధించాడు. 1989లో వెంకటేశ్వరరావు సోదరుడు కొత్త రామచంద్రారావు కాంగ్రెస్ తరఫున గెలిచాడు. 1994లో ఇద్దరు సోదరులు (కాంగ్రెస్, ఇండిపెండెంట్) పోటీపడడంతో తొలిసారిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపొందినది. మధుసూధరావు బంధువు జూపల్లి కృష్ణారావు 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 2004లో కాంగ్రెస్ రెబల్‌గా ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచాడు.
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు.
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
1983 ఎన్నికలు[మార్చు]
1983లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్త వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంగూరు కృష్ణారెడ్డిపై 12708 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. వెంకటేశ్వరరావుకు 39241 ఓట్లు రాగా, కృష్ణారెడ్డి 26533 ఓట్లు సాధించాడు. రంగంలో ఉన్న జనతాపార్టీ అభ్యర్థికి 16600 ఓట్లు వచ్చాయి.[3]
1999 ఎన్నికలు[మార్చు]
1999 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కె.మధుసూదనరావుపై 5305 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. జూపల్లి కృష్ణారావుకు 54677 ఓట్లు రాగా, మధుసూదనరావు 49372 ఓట్లు పొందినాడు. మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. బరిలో ఉన్న మరో ఇద్దరు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన జూపల్లి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన కటికనేని మధుసూదన్ రావు పై 2944 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. కృష్ణారావుకు 49254 ఓట్లు రాగా, మధుసూదనరావుకు 46310 ఓట్లు లభించాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణారావు రెబెల్ అభ్యర్థిగా పోటీలోకి దిగి విజయం సాధించాడు.
- 2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
2009 ఎన్నికలు[మార్చు]
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ శాసన సభ్యులు జూపల్లి కృష్ణారావు మళ్ళి పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున జగదీశ్వర్ రావు పోటీ పడ్డాడు. భారతీయ జనతా పార్టీ తరఫున వి.నరేందర్ రావు, ప్రజారాజ్యం పార్టీ మద్దతుతో మనపార్టీకి చెందిన కె.నర్సింహయ్య, లోక్‌సత్తా పార్టీ తరఫున పి.విష్ణువర్థన్ రెడ్డ్ పోటీచేశారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సి.జగదీశ్వర్ రావుపై 1700కుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
నియోజకవర్గపు ప్రముఖులు[మార్చు]
- మందుగుల నర్సింగరావు
- ఆంధ్రరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు బంధువు అయిన మందుగుల నర్సింగరావు 1957లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభ్యుడైనాడు. అప్పటి రాష్ట్రప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా పొందినాడు.
- కొత్త వెంకటేశ్వరరావు
- ఈ నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు గెలుపొందడమే కాకుండా అత్యధికసార్లు విజయం సాధించిన అభ్యర్థిగా కూడా రికార్డు ఇతని పేరిటే ఉంది. తొలిసారి 1972లో ఓటమి పొందిననూ ఆ తరువాత 1978, 83, 85లలో వరసగా మూడు సార్లు విజయం సాధించాడు. 1989లో తన సోదరుడికి కాంగ్రెస్ టికెట్టు ఇచ్చి గెలిపించాడు. 1994లో తన సోదరుడికి పోటీగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడంతో ఇద్దరూ పరాజయం పొందినారు.
- జూపల్లి కృష్ణారావు
- నియోజకవర్గం నుంచి వరసగా రెండో సారి ఎన్నికైన జూపల్లి కృష్ణారావు వ్యాపారం వృత్తి నుంచి పైకిఎదిగిన నేత. తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున 1999లో ఎన్నికవగా, 2004లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కేటాయించగా జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ రెబెల్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి విజయం సాధించాడు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించాడు.[4]
- మియాపురం రామకృష్ణారావ్
- కొల్లాపూర్ సంస్థానానికి మంత్రిగా పని చేసారు. వీరు గొప్ప కవి. ఎన్నో గేయాలు రచించారు. ప్రముఖ బ్రాహ్మనులు. వీరి మనువడు రమేష్ ప్రముఖ వ్యపారవేత్త.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[5]
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 1952 అనంత రామచంద్రారెడ్డి పి.డి.ఎఫ్ టి.శాంతాబాయి కాంగ్రెస్ పార్టీ 1957 మందుగుల నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ కె.గోపాలరావు పి.డి.ఎఫ్ 1962 కె.రంగదాస్ కాంగ్రెస్ పార్టీ కె.గోపాలరావు సి.పి.ఐ 1967 బి.నర్సింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థి కె.రంగదాస్ కాంగ్రెస్ పార్టీ 1972 కె.రంగదాస్ స్వతంత్ర అభ్యర్థి కొత్త వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ 1978 కొత్త వెంకటేశ్వరరావు ఇందిరా కాంగ్రెస్ కె.రంగదాస్ జనతా పార్టీ 1983 కొత్త వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ వి.కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ 1985 కొత్త వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ సురవరం సుధాకర్ రెడ్డి సి.పి.ఐ 1989 కొత్త రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ సురవరం సుధాకర్ రెడ్డి సి.పి.ఐ 1994 కె.మధుసూదన్ రావు తెలుగుదేశం పార్టీ కొత్త రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ 1999 జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ కె.మధుసూదన్ రావు తెలుగుదేశం పార్టీ 2004 జూపల్లి కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థి కె.మధుసూదన్ రావు తెలుగుదేశం పార్టీ 2009 జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ జగదీశ్వర్ రావు తెలుగుదేశం పార్టీ 2012 ఉప ఎన్నికలు జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సమితి 2014 జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సమితి బీరం.హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2018 బీరం.హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సమితి సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2018 85 కొల్లాపూర్ జనరల్ బీరం హర్షవర్దన్ రెడ్డి పు కాంగ్రెస్ 80611 జూపల్లి కృష్ణారావు పు తెరాస 68068 2014 85 కొల్లాపూర్ జనరల్ జూపల్లి కృష్ణారావు పు తెరాస 72741 బీరం హర్షవర్దన్ రెడ్డి పు కాంగ్రెస్ 62243 2012 Bye Poll Kollapur GEN జూపల్లి కృష్ణారావు M TRS 58107 మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి M INC 43083 2009 85 Kollapur GEN జూపల్లి కృష్ణారావు M INC 58046 చింతలపల్లి జగదీశ్వర్ రావు M తె.దే.పా 56538 2004 195 Kollapur GEN జూపల్లి కృష్ణారావు M IND 49369 కటికనేని మధుసూదన్ రావు M తె.దే.పా 46329 1999 195 Kollapur GEN జూపల్లి కృష్ణారావు M INC 54677 కటికనేని మధుసూదన్ రావు M తె.దే.పా 49372 1994 195 Kollapur GEN కటికనేని మధుసూదన్ రావు M తె.దే.పా 55777 కొత్త రామచంద్రరావు M INC 22003 1989 195 Kollapur GEN కొత్త రామచంద్రరావు M INC 47950 సురవరం సుధాకర్ రెడ్డి M CPI 38791 1985 195 Kollapur GEN కొత్త వెంకటేశ్వరరావు M INC 41222 సురవరం సుధాకర్ రెడ్డి M CPI 38723 1983 195 Kollapur GEN కొత్త వెంకటేశ్వరరావు M INC 39241 Vangur Krishna Reddy M IND 26533 1978 195 Kollapur GEN కొత్త వెంకటేశ్వరరావు M INC 36325 Kondagari Ranga Dasu M JNP 21662 1972 195 Kollapur GEN K. Rangadas M IND 27434 కొత్త వెంకటేశ్వరరావు M INC 23903 1967 195 Kollapur GEN B. Narayana Reddy M IND 25321 K. Rangadas M INC 23749 1962 197 Kollapur GEN K. Rang Das M INC 21197 Gopal Rao M CPI 19855 1957 2 Kollapur GEN M. Narsing Rao M INC 19366 Gopal Rao M PDF 10021
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక. మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 23-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
- ↑ ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 07-01-1983.
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 17-05-2009
- ↑ Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.