క‌టిక‌నేని మ‌ధుసూద‌న్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క‌టిక‌నేని మ‌ధుసూద‌న్ రావు

మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 15 మార్చి 1950
నార్లపురం , కొల్లాపూర్ మండలం , నాగర్‌కర్నూల్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం
మరణం 15 డిసెంబర్ 2021
హైదరాబాద్‌
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం హైదరాబాద్

క‌టిక‌నేని మ‌ధుసూద‌న్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

క‌టిక‌నేని మ‌ధుసూద‌న్ రావు 15 మార్చి 1950లో తెలంగాణ రాష్ట్రం , నాగర్‌కర్నూల్ జిల్లా , కొల్లాపూర్ మండలం , నార్లపురం గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

క‌టిక‌నేని మ‌ధుసూద‌న్ రావు తొలిసారిగా 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలై, మూడో స్థానంలో నిలిచాడు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్త రాంచందర్ రావు పై 33774 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మ‌ధుసూద‌న్ రావు 1999 , 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసి ఓటమిపాలై, మూడో స్థానంలో నిలిచాడు. మ‌ధుసూద‌న్ రావు 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[1]

మరణం[మార్చు]

ఆయన 15 డిసెంబర్ 2020న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్య పొందుతూ మరణించాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. News18 (2018). "Kollapur Rural Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andrajyothy (15 December 2020). "మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్‌రావు హఠాన్మరణం". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
  3. Sakshi (16 March 2021). "దివంగ‌త ఎమ్మెల్యేల‌కు అసెంబ్లీ నివాళి". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.