సునీత మహేందర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్నం సునీతా రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2006 - 2011
2014 - 2019

వ్యక్తిగత వివరాలు

జననం (1974-11-25) 1974 నవంబరు 25 (వయసు 49)
దాకూర్, ఆందోల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రాజమణి, గోపాల్ రెడ్డి
జీవిత భాగస్వామి పి.మహేందర్ రెడ్డి [1]
బంధువులు పట్నం నరేందర్ రెడ్డి (మరిది)
సంతానం పట్నం రినీష్‌ రెడ్డి (కుమారుడు), మనీషా రెడ్డి (కుమారై)[2]
నివాసం బంజారాహిల్స్‌. హైదరాబాద్

పట్నం సునీత మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె తొలిసారి టీడీపీ నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా పని చేసి, ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లా ప్రజా పరిషత్‌ (జడ్పీ) చైర్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తుంది.[3]

రాజకీయ జీవితం[మార్చు]

సునీతా రెడ్డి తన భర్త పి.మహేందర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బంట్వారం జడ్పీటీసిగా ఎన్నికై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది. ఆమె ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి నుండి 2014లో యాలాల జడ్పీటీసిగా రెండోసారి ఎన్నికై తిరిగి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది.[4] ఆమె 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా కొట్‌పల్లి జడ్పీటీసిగా ఎన్నికై నూతనంగా ఏర్పాటైన వికారాబాద్ జిల్లా తొలి ప్రజా పరిషత్‌ (జడ్పీ) చైర్‌పర్సన్‌గా 2019 జూన్ 8న ఎన్నికైంది.[5][6]

2024లో మర్పల్లి మండలం పట్లూరులో స్వంత పార్టీ నాయకులే తన వాహనాన్ని అడ్డుకుని వీరంగం సృష్టించిన ఘటనపై ఆమె అధిష్ఠానంకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైంది[7], అప్పటి మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పట్నం మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అప్పటి వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ తదితరులను హైదరాబాద్‌కు పిలిపించి వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా ఆమె తన అసంతృప్తిని వ్యక్త పరిచింది.  ఆమె అప్పటి నుంచి చాలావరకు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరం ఉంటూ 2023లో జరిగిన శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయకుండా దూరంగా ఉంది.

సునీతా రెడ్డి 2024 ఫిబ్రవరి 16న గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరింది.[8][9]

మూలాలు[మార్చు]

  1. Sakshi (14 July 2014). "పట్టం పట్నంకే." Sakshi. Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
  2. Andhrajyothy (14 May 2023). "వధూవరులకు సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం". Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.
  3. Sakshi (8 June 2019). "తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.
  4. Sakshi (14 July 2014). "జెడ్పీ.. గులాబీ వశం". Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.
  5. TV9 Telugu (8 June 2019). "జడ్పీల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం..32 స్థానాలు క్లీన్ స్వీప్". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The Hindu (8 June 2019). "New zilla parishad chairpersons". Archived from the original on 25 ఫిబ్రవరి 2021. Retrieved 28 January 2022.
  7. TV9 Telugu (14 July 2022). "వికారాబాద్‌ టీఆర్ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు.. ఏకంగా ఆమె కారుపై." Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. V6 Velugu (16 February 2024). "కాంగ్రెస్లో చేరిన పట్నం సునీతారెడ్డి, బొంతు రామ్మోహన్". Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Andhrajyothy (20 March 2024). "మల్కాజిగిరి నుంచి సునీత". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.