భారతదేశంలో వైద్య కళాశాలలు
భారతదేశంలో వైద్య విద్యను అందించే విద్యా సంస్థ, వైద్య కళాశాల. అమెరికా లోను, కొన్ని ఇతర దేశాలలోనూ దీన్ని "వైద్య పాఠశాల" అంటారు. MBBS అనేది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 ద్వారా స్థాపించబడిన వైద్య డిగ్రీ. ప్రస్తుతం ఇది నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019 కులోబడి ఉంది. MBBS తర్వాత, వైద్యులు రాష్ట్రాల వైద్య మండళ్ళలో నమోదు చేసుకుంటారు.
గుర్తింపు
[మార్చు]భారతీయ చట్టం ప్రకారం ఈ సంస్థలను నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించాలి [1] ఇలా ఆమోదించబడిన వైద్య కళాశాలల జాబితాను భారత ప్రభుత్వం వద్ద ఉంటుంది.[2] MBBS డిగ్రీలు లేని వ్యక్తులు కొందరు, వైద్యుల వలె ప్రాక్టీస్ చేస్తూంటారు. వారిని క్వాక్స్ అంటారు. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 ప్రకారం, ఇలాంటి వారికి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, INR 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.[3]
ప్రవేశాలు, విద్య
[మార్చు]భారతదేశంలో ఆధునిక వైద్యం చేసేందుకు అవసరమైన ప్రామాణిక డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS). ఐదున్నర-సంవత్సరాల గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసిన తర్వాత సంపాదించే డిగ్రీ ఇది. సాధారణ సైన్స్ సబ్జెక్టులలో ఒక సంవత్సరం ప్రి-క్లినికల్ అధ్యయనాలు, మూడున్నర సంవత్సరాల పారాక్లినికల్, క్లినికల్ స్టడీస్‌తో దీని పాఠ్యప్రణాళిక కూడుకుని ఉంటుంది. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు క్లినికల్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ప్రారంభించే ముందు, విద్యార్థులు అనేక పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి. వాటిలో చివరి దాన్ని రెండు భాగాలుగా నిర్వహిస్తారు. మెడికల్ స్పెషాలిటీలలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం MBBS అయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు చదవాలి. ఇది చదివాక మాస్టర్ ఆఫ్ సర్జరీ గానీ, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ గానీ లభిస్తుంది. ఆ తరువాత మరో రెండు సంవత్సరాల చదువు పూర్తి చేస్తే మెడికల్ స్పెషలైజేషన్‌లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు పొందవచ్చు.
వైద్య కళాశాలలు
[మార్చు]వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రకారం, అత్యధిక సంఖ్యలో వైద్య కళాశాలలు (392) ఉన్న దేశం భారతదేశం.[4] ప్రాంతాల వారీగా కళాశాలల జాబితా ఇది:
ప్రాంతం వారీగా
[మార్చు]స.నెం | ప్రాంతాలు | వైద్య కళాశాల జాబితా | MBBS అందిస్తున్న కళాశాలల సంఖ్య [5] | ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కళాశాలలు | ప్రైవేట్ కళాశాలలు | ప్రభుత్వం కళాశాల సీట్లు | ప్రైవేట్ కాలేజీ సీట్లు | మొత్తం సంఖ్య. సీట్లు |
---|---|---|---|---|---|---|---|---|
SI | దక్షిణ భారతదేశం | 154 | 52 | 102 | 6830 | 13705 | 20535 | |
WI | వెస్ట్ ఇండియా | 77 | 34 | 43 | 4540 | 5295 | 98034 | |
NI | ఉత్తర భారతదేశం | 70 | 37 | 33 | 4499 | 3745 | 8244 | |
EI | తూర్పు భారతదేశం | 47 | 37 | 10 | 4116 | 1010 | 5026 | |
మొత్తం | 348 | 160 | 188 | 19985 | 23755 | 43640 |
రాష్ట్రాల వారీగా
[మార్చు]క్ర.సం | రాష్ట్రం/కేం.పా.ప్రాం | కాలేజీల సంఖ్య[5] | ప్రభుత్వ కాలేజీలు | ప్రైవేటు కాలేజీలు | ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు | ప్రైవేటు కాలేజీల్లో సీట్లు | మొత్తం సీట్లు |
---|---|---|---|---|---|---|---|
1 | ఆంధ్రప్రదేశ్ | 31 | 13 | 18 | 2,410 | 2,800 | 5,210 |
2 | అస్సాం | 8 | 8 | 0 | 1,050 | - | 1,050 |
3 | బీహార్ | 17 | 11 | 6 | 1,390 | 750 | 2,140 |
4 | చండీగఢ్ | 1 | 1 | 0 | 150 | - | 150 |
5 | ఛత్తీస్‌గఢ్ | 10 | 7 | 3 | 895 | 450 | 1,345 |
6 | ఢిల్లీ | 10 | 8 | 2 | 1,222 | 200 | 1,422 |
7 | గోవా | 1 | 1 | 0 | 180 | - | 180 |
8 | గుజరాత్ | 31 | 18 | 13 | 3,700 | 2,000 | 5,700 |
9 | హర్యానా | 12 | 5 | 7 | 710 | 950 | 1,660 |
10 | హిమాచల్ ప్రదేశ్ | 8 | 7 | 1 | 770 | 150 | 920 |
11 | జమ్మూ కాశ్మీర్ | 10 | 9 | 1 | 1,035 | 100 | 1,135 |
12 | జార్ఖండ్ | 8 | 7 | 1 | 630 | 150 | 780 |
13 | కర్ణాటక | 60 | 19 | 41 | 2,900 | 6,445 | 9,345 |
14 | కేరళ | 31 | 10 | 21 | 1,555 | 2,550 | 4,105 |
15 | మధ్యప్రదేశ్ | 23 | 14 | 9 | 2,135 | 1,450 | 3,585 |
16 | మహారాష్ట్ర | 57 | 26 | 31 | 4,430 | 4,570 | 9,000 |
17 | మణిపూర్ | 2 | 2 | 0 | 225 | - | 225 |
18 | మిజోరం | 1 | 1 | 0 | 100 | - | 100 |
19 | ఒడిశా | 12 | 8 | 4 | 1,250 | 700 | 1,950 |
20 | పుదుచ్చేరి | 9 | 2 | 7 | 380 | 1,150 | 1,530 |
21 | పంజాబ్ | 10 | 4 | 6 | 650 | 775 | 1,425 |
22 | రాజస్థాన్ | 24 | 16 | 8 | 2,900 | 1,300 | 4,200 |
23 | సిక్కిం | 1 | 0 | 1 | - | 50 | 50 |
24 | తమిళనాడు | 52 | 26 | 26 | 3,650 | 4,350 | 8,000 |
25 | తెలంగాణ | 34 | 11 | 23 | 1,790 | 3,450 | 5,240 |
26 | త్రిపుర | 2 | 1 | 1 | 125 | 100 | 225 |
27 | ఉత్తర ప్రదేశ్ | 57 | 26 | 31 | 3,178 | 4,250 | 7,428 |
28 | ఉత్తరాఖండ్ | 6 | 4 | 2 | 525 | 300 | 825 |
29 | పశ్చిమ బెంగాల్ | 26 | 20 | 6 | 3,150 | 850 | 4,000 |
మొత్తం | 558 | 289 | 269 | 43,435 | 39,840 | 83,275 |
మూలాలు
[మార్చు]- ↑ "Medical Council of India: Home Page". Archived from the original on 2009-11-03. Retrieved 2022-01-13.
- ↑ "STATUS OF MEDICAL COLLEGES FOR ADMISSION FOR THE ACADEMIC SESSION 2007–08". mohfw.nic.in. Archived from the original on 1 సెప్టెంబరు 2006. Retrieved 19 March 2018.
- ↑ "NMC Act: Punishment for quackery enhanced up to one year imprisonment and fine of Rs. 5 lakh says Harsh Vardhan". Business Standard.
- ↑ "World Directory". World Federation for Medical Education. Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 9 May 2021.
- ↑ 5.0 5.1 "Archived copy". Archived from the original on 13 May 2013. Retrieved 2014-06-29.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) ఉల్లేఖన లోపం: చెల్లని<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు