బానోతు హరిప్రియ నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బానోతు హరిప్రియ నాయక్
బానోతు హరిప్రియ నాయక్

నియోజకవర్గము ఇల్లందు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

బానోతు హరిప్రియ నాయక్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారత జాతీయ కాంగ్రెస్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నది.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

హరిప్రియ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని దాస్య తండాలో జన్మించింది. 2010లో జెఎన్టీయూలో ఎంటెక్ పూర్తి చేసింది. హరిసింగ్ నాయక్ ను వివాహం చేసుకుంది.

రాజకీయ జీవితం[మార్చు]

తన కుటుంబంలో పెద్దగా రాజకీయ నేపథ్యం ఉన్నవారు లేకపోయినా, చిన్నతనం నుంచే హరిప్రియా నాయక్ కు నాయకత్వ లక్షణాలు ఉండేవి. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసిన హరిప్రియ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య చేతిలో ఓడిపోయింది. అప్పటినుండి ఇల్లెందు రాజకీయాలలో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసింది. 2018లో కాంగ్రెస్ పార్టిలో చేరి, ఆ పార్టీ తరపున పోటీచేసి కోరం కనకయ్య పై హరిప్రియ 2,600 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది.

2019, జనవరి 17న ఇల్లందు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసింది.[3][4]

నిర్వహించిన పదవులు[మార్చు]

  1. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం కార్యదర్శి
  2. చత్తీస్‌ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసీసీ పరిశీలకురాలు
  3. ఇల్లందు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, తాజా వార్తలు. "తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా." మూలం నుండి 31 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 31 March 2019. Cite news requires |newspaper= (help)
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (12 December 2018). "అసెంబ్లీకి ఎన్నికైన తొమ్మిదిమంది మహిళలు". మూలం నుండి 31 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 31 March 2019. Cite news requires |newspaper= (help)
  3. 10టివీ (17 January 2019). "దైవ సాక్షిగా: ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం". మూలం నుండి 31 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 31 March 2019. Cite news requires |newspaper= (help)
  4. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (17 January 2019). "ముందుగా మహిళా ఎమ్మెల్యేలు". మూలం నుండి 31 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 31 March 2019. Cite news requires |newspaper= (help)