కోరం కనకయ్య
కోరం కనకయ్య | |||
| |||
భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్
| |||
పదవీ కాలం 2019 - ప్రస్తుతం | |||
ముందు | ఊకే అబ్బయ్య | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఇల్లందు శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మార్చి 11, 1962 కోయగూడెం గ్రామం, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | బీఆర్ఎస్ | ||
నివాసం | ఖమ్మం, తెలంగాణ |
కోరం కనకయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో ఇల్లందు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]
జననం
[మార్చు]ఈయన 1962, మార్చి 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం, కోయగూడెం గ్రామంలో జన్మించాడు.[2]
రాజకీయ ప్రస్థానం
[మార్చు]కోరం కనకయ్య 1986లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 1995లో టేకులపల్లి మండలం నుండి జెడ్పిటీసిగా గెలిచాడు. 2009లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి ఓటమి పాలయ్యాడు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడాక 2014లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ దక్కించుకొని, గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టేకులపల్లి మండలంలో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్‌గా కోరం కనకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[3][4][5]
కోరం కనకయ్య బీఆర్ఎస్ పార్టీని వీడి 2023 జులై 2న ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Eenadu (7 November 2023). "టేకులపల్లి చట్టసభల చుట్టం". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ నమస్తే తెలంగాణ, latest news (8 June 2019). "భద్రాద్రి జెడ్పీ చైర్మన్‌గా కోరం కనకయ్య". www.ntnews.com. Archived from the original on 11 November 2019. Retrieved 11 November 2019.
- ↑ Telangana Today, Telangana (4 June 2019). "TRS set to win Khammam, Kothagudem ZPP chief posts". Telangana Today. Archived from the original on 12 November 2019. Retrieved 12 November 2019.
- ↑ The Hans India, Telangana (7 August 2019). "Kamal Raju, Kanakaiah take charge as Khammam, Kothagudem ZP chiefs". www.thehansindia.com. Archived from the original on 12 November 2019. Retrieved 12 November 2019.
- ↑ A. B. P. Desam (2 July 2023). "కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.