మెచ్చా నాగేశ్వరరావు
మెచ్చా నాగేశ్వరరావు | |||
| |||
పదవీ కాలం 2018- ప్రస్తుతం | |||
ముందు | తాటి వెంకటేశ్వర్లు | ||
---|---|---|---|
నియోజకవర్గం | అశ్వరావుపేట శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జూన్ 16, 1965 తాటిసుబ్బన్నగూడెం, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | రాములు - ఆదెమ్మ | ||
జీవిత భాగస్వామి | శ్యామల | ||
సంతానం | ఒక కుమారుడు | ||
నివాసం | అశ్వరావుపేట, తెలంగాణ |
మెచ్చా నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ నుండి అశ్వరావుపేట శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]
జననం, విద్య
[మార్చు]మెచ్చా నాగేశ్వరరావు 1965, జూన్ 16న తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, మొద్దులగూడెం పంచాయతీ పరిధిలోని తాటి సుబ్బన్నగూడెం అనే మారుమూల గిరిజన గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు మెచ్చా రాములు, తల్లి పేరు మెచ్చా ఆదెమ్మ. ఇతనికి ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. మూడో తరగతి వరకు ఊరికి మూడు కిలోమీటర్లు దూరంలోని తొట్టిపంపు గ్రామంలో, నాలుగో తరగతి నాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. 5 నుంచి 10 వరకు అశ్వారావుపేట ఎస్టీ హాస్టల్‌లో ఉండి జమీందారు దివాణం బడిలో చదువుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]నాగేశ్వరరావు తన మేనమామ కూతురు శ్యామలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి పిల్లలు లేకపోవడంతో సోదరుడి కుమారుడిని దత్తత తీసుకున్నారు.
సామాజిక సేవ
[మార్చు]అశ్వారావుపేటలో ఐటీఐ కాలేజీ స్థాపించిన పీకేఎస్.మాధవన్ దగ్గర గిరిజనులను చైతన్యవంతులను చేసేందుకు ఆర్గనైజర్‌గా చేరిన నాగేశ్వరరావు అశ్వారావుపేట, దమ్మపేట, ముల్కలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తిరుగుతూ గిరిజనులకు అవేర్ సంస్థ పథకాల గురించి అవగాహన కలిగించేవాడు.
రాజకీయ విశేషాలు
[మార్చు]మెచ్చా నాగేశ్వరరావు 1995లో దమ్మపేట మండలం మొద్దులగూడెం సర్పంచ్‌గా తొలిసారిగా ఎన్నికైయ్యాడు. 2001లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో మొద్దులగూడెం సర్పంచ్‌గా నుంచి ఆయన ఏకగ్రీవమయ్యాడు.[2] 2015లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, అశ్వారావుపేట నియోజకవర్గ పార్టీ బాధ్యులుగా నాగేశ్వరరావు ఉన్నాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు చేతిలో 930 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు పై 13,117 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3] 2021లో టిఆర్ఎస్ పార్టీలో చేరాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ Sakshi (28 July 2019). "'తుమ్మలని తప్పించుకొని తిరిగేవాన్ని'". Archived from the original on 31 July 2021. Retrieved 31 July 2021.
- ↑ Sakshi (15 January 2019). "సర్పంచ్ టు ఎమ్మెల్యే". Archived from the original on 31 July 2021. Retrieved 31 July 2021.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (7 April 2021). "టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీపీ విలీనం". Namasthe Telangana. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.