తాటి వెంకటేశ్వర్లు
తాటి వెంకటేశ్వర్లు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2018 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1999 - 2004 | |||
నియోజకవర్గం | బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 01 జులై 1962 సారపాక, బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | ![]() ![]() | ||
తల్లిదండ్రులు | తాటి కట్టప్ప | ||
జీవిత భాగస్వామి | రత్నకుమారి[1] |
తాటి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో అశ్వరావుపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
జననం, విద్యాభాస్యం[మార్చు]
తాటి వెంకటేశ్వర్లు 1962 జూలై 1న తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక గ్రామంలో జన్మించాడు. ఆయన జీలుగుమిల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు.
రాజకీయ జీవితం[మార్చు]
తాటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి టీడీపీ పార్టీ తరపున 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బూర్గంపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైసీపీ అభ్యర్థిగా అశ్వరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండొవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. తాటి వెంకటేశ్వర్లు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు.
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (5 July 2015). "ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు భార్య మృతి". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.