Jump to content

బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా (ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) లోని శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గం 1962 నుంచి ఏర్పడి 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పినపాక శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ఈ నియోజకవర్గంలో 1962 నుంచి 2009 వరకు ఒక ఉప ఎన్నికతో సహా 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుండి కాంగ్రెస్‌ పార్టీ ఆరుసార్లు, సీపీఐ ఐదుసార్లు, టీడీపీ, ఇండిపెండెంట్‌, వైసీపీలు చెరొక్క సారి గెలుపొందాయి.[1][2]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1962 282 బూర్గంపాడు (ఎస్టీ) కంగల బుచ్చయ్య మహిళా సిపిఐ పార్టీ 22257 కొమరం రామయ్య పు కాంగ్రెస్ పార్టీ 22215
1967 ఉప ఎన్నిక ఇల్లందు (ఎస్టీ) కె.రామయ్య పు స్వతంత్ర ఏకగ్రీవ ఎన్నిక[3]
1967 269 బూర్గంపాడు (ఎస్టీ) ఆర్. కొమరం పు కాంగ్రెస్ పార్టీ 27631 చీమల పు స్వతంత్ర 13607
1972 269 బూర్గంపాడు (ఎస్టీ) కామారం రామయ్య పు కాంగ్రెస్ పార్టీ 30220 గోగుల సీతయ్య పు స్వతంత్ర 22163
1978 275 బూర్గంపాడు (ఎస్టీ) పూనెం రామచంద్రయ్య[4] పు కాంగ్రెస్ పార్టీ 21287 పాయం మంగయ్య పు కాంగ్రెస్ (ఐ) 20256
1983 275 బూర్గంపాడు (ఎస్టీ) ఊకే అబ్బయ్య పు సిపిఐ 17524 చందా లింగయ్య పు స్వతంత్ర 15803
1985 275 బూర్గంపాడు (ఎస్టీ) చందా లింగయ్య పు కాంగ్రెస్ 36947 ఊకే అబ్బయ్య పు సీపీఐ 34719
1989 275 బూర్గంపాడు (ఎస్టీ) కుంజా భిక్షం పు సీపీఐ 46179 చందా లింగయ్య పు కాంగ్రెస్ 41347
1994 275 బూర్గంపాడు (ఎస్టీ) కుంజా భిక్షం పు సీపీఐ 56946 చందా లింగయ్య పు కాంగ్రెస్ 37132
1999 275 బూర్గంపాడు (ఎస్టీ) తాటి వెంకటేశ్వర్లు పు టీడీపీ 45904 చందా లింగయ్య పు కాంగ్రెస్ 42976
2004 275 బూర్గంపాడు (ఎస్టీ) పాయం వెంకటేశ్వర్లు పు సిపిఐ 68080 తాటి వెంకటేశ్వర్లు పు టీడీపీ 52279

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (4 March 2019). "ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే.. జంప్‌ జిలానీయే.. ఆరుగురు ఎమ్మెల్యేలదీ అదేబాట". Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.
  2. Elections (2022). "Burgampahad assembly election results in Andhra Pradesh". Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.
  3. Eenadu (9 November 2023). "అభ్యర్థులు వారే.. గుర్తులు మారె." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  4. Eenadu (7 November 2023). "టేకులపల్లి చట్టసభల చుట్టం". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.