పాయం వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాయం వెంకటేశ్వర్లు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2018
తరువాత రేగ కాంతారావు
నియోజకవర్గం పినపాక నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2009
నియోజకవర్గం బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 06 మే 1974
సమతిసింగారం, మణుగూరు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
సీపీఎం
భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కామరాజు
నివాసం మణుగూరు

పాయం వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో పినపాక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

పాయం వెంకటేశ్వర్లు 1974 మే 6న తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సమీపంలోని సమతిసింగారం గ్రామంలో జన్మించాడు. ఆయన మణుగూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో చేరి మధ్యలోనే ఆపేసాడు.

రాజకీయ జీవితం[మార్చు]

పాయం వెంకటేశ్వర్లు విద్యార్థి దశలోనే సీపీఎం పార్టీ అనుబంధ సంస్థ ఎస్.ఎఫ్.ఐలో చేరి విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన అనంతరం సీపీఎం పార్టీలో చేరి వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి సీపీఎం పార్టీ తరపున 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బూర్గంపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. పాయం వెంకటేశ్వర్లు సీపీఎం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైసీపీ అభ్యర్థిగా పినపాక నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండొవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ రేగ కాంతారావు చేతిలో ఓడిపోయాడు.

పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి జులై 2న ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3]  ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో పినపాక అభ్యర్థిగా ప్రకటించింది.[4][5]

 

మూలాలు[మార్చు]

  1. Sakshi (16 May 2014). "పినపాక,వైరాలో వైఎస్ఆర్ సీపీ విజయం". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
  2. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  3. A. B. P. Desam (2 July 2023). "కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.
  4. Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  5. Eenadu (28 October 2023). "ఆచితూచి హస్తం అడుగులు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.