వేలేరుపాడు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేలేరుపాడు
—  మండలం  —
పశ్చిమ గోదావరి పటంలో వేలేరుపాడు మండలం స్థానం
పశ్చిమ గోదావరి పటంలో వేలేరుపాడు మండలం స్థానం
వేలేరుపాడు is located in Andhra Pradesh
వేలేరుపాడు
వేలేరుపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో వేలేరుపాడు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°38′20″N 81°24′16″E / 17.638787°N 81.404343°E / 17.638787; 81.404343
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రం [[వేలేరుపాడు]]
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 22,882
 - పురుషులు 11,007
 - స్త్రీలు 11,975
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.67%
 - పురుషులు 43.70%
 - స్త్రీలు 29.93%
పిన్‌కోడ్ {{{pincode}}}

వేలేరుపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ప్రసిద్డ పుణ్యక్షేత్రమయిన భద్రాచలం నుంచి 60 కి.మీ దూరంలో ఉంది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ముంపులో నీటమునిగే ఖమ్మం జిల్లా లోని ఏడు మండలాలను ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లోకి బదలాయించారు.ఆ సమయంలో ఈ మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసింది. వేలేరుపాడు ఏజెన్సీ మండలం. ఈ మండలంలోని డెబ్బై శాతానికి పైగా జనాభా గిరిజనులే.ఈ ప్రాంతం గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధి చెందింది.[1]. వేసవిలో మండలంలోని కట్కూరు, పేరంటాలపల్లి గ్రామాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మండలంలోని రుద్రమకోటలోని శివాలయం కాకతీయుల కాలం నాటిదిగా చెబుతారు.మండలంలోని కట్కూరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం పాపికొండలకు లాంచీ సౌకర్యం ఉంది.OSM గతిశీల పటము

చరిత్ర[మార్చు]

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను...ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం (భద్రాచలం మినహా మండలంలోని అన్ని గ్రామాలు), కూనవరం, చింతరు, వరరామచంద్రాపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 22,882 - పురుషులు 11,007 - స్త్రీలు 11,975

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. హిందూ లో ఆర్టికల్
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-03-29. Retrieved 2019-11-08.

వెలుపలి లంకెలు[మార్చు]