Coordinates: 16°57′43″N 81°15′29″E / 16.962°N 81.258°E / 16.962; 81.258

ద్వారకా తిరుమల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°57′43″N 81°15′29″E / 16.962°N 81.258°E / 16.962; 81.258
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంద్వారకా తిరుమల
Area
 • మొత్తం266 km2 (103 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం68,989
 • Density260/km2 (670/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి983


ద్వారకా తిరుమల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా లోని మండలం.[3]OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 63,399, అందులో పురుషులు 32,531 మంది కాగా స్త్రీలు 30,868 మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 64.71% - పురుషులు అక్షరాస్యత 68.41% - స్త్రీలు అక్షరాస్యత 60.82%.

వ్యవసాయం, నీటి వనరులు[మార్చు]

ఈ మండలంలో వ్యవసాయం ప్రధానంగా మెరక వ్యవసాయం. చెరువులు, భూగర్భ జలాలు ముఖ్యమైన నీటి వనరులు. పుగాకు, మామిడి, నిమ్మ, పామాయిల్, సపోటా, ప్రొద్దు తిరుగుడు, అపరాలు, జీడిమామిడి వంటి తోటలు అధికంగా ఉన్నాయి. చెరువుల క్రింద కొంత వరి వ్యవసాయం జరుగుతుంది.

ఆర్ధిక వ్యవస్థ[మార్చు]

ప్రజలకు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. వ్యవసాయాధారిత వ్యాపారము, పరిశ్రమలు పరిమితంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సిరామిక్ పరిశ్రమలకు పనికొచ్చే బంకమన్ను లభిస్తుంది. అందువలన ద్వారకా తిరుమల పరిసరాలలో పెంకులు, రిఫ్రాక్టరీ ఇటుకలు, సెరామిక్ టైల్స్ పరిశ్రమలు ఉన్నాయి. వరి పండే ప్రాంతాలలో బియ్యం మిల్లులున్నాయి.

విద్య, వైద్య సదుపాయాలు[మార్చు]

శ్రీ వెంకటేశ్వర వికలాంగులకు సర్జరీ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఉంది. వి.ఐ.ఆర్.ఆర్.ఢి మొదటి దశలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టి ఉంది.

మండలం లోని పట్టణాలు[మార్చు]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. గుణ్ణం పల్లి
  2. ఎం.నాగుల పల్లి
  3. తిరుమలం పాలెం
  4. పంగిడి గూడెం
  5. జి.కొత్తపల్లి
  6. రాళ్లకుంట
  7. రామన్నగూడెం
  8. శరభాపురం
  9. సత్తెన్నగూడెం
  10. సత్తాల
  11. తిమ్మాపురం
  12. వేంపాడు
  13. వెంకటకృష్ణాపురం
  14. చెలికానివాని పోతేపల్లె
  15. ఎడవల్లి
  16. దొరసానిపాడు
  17. గుండుగొలనుకుంట
  18. హవేలిలింగపాలెం
  19. ఐ.ఎస్‌.జగన్నాధపురం
  20. ఐ.ఎస్‌.రాఘవాపురం
  21. జాజులకుంట
  22. కోడిగూడెం
  23. కొమ్మర (ఉత్తర)
  24. కొమ్మర (దక్షిణ)
  25. కొమ్ముగూడెం
  26. కృష్ణాపురం
  27. మాలసానికుంట
  28. మల్లేస్వరం
  29. నారాయణాపురం
  30. పి.కన్నాపురం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
  3. "Villages and Towns in Dwarakatirumala Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-03-23.[permanent dead link]

వెలుపలి లంకెలు[మార్చు]