Jump to content

తాతా మధు

వికీపీడియా నుండి
తాతా మధు
తాతా మధు


ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
5 జనవరి 2022 నుండి 4 జనవరి 2028
ముందు బాలసాని లక్ష్మీనారాయణ
నియోజకవర్గం ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 12 జూన్‌ 1965
పిండిప్రోలు గ్రామం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు తాతా వెంకటకృష్ణయ్య, కమలమ్మ
జీవిత భాగస్వామి భవాని
సంతానం భార్గవ్‌, కృష్ణస్వరూప్‌
నివాసం ఖమ్మం
మతం హిందూ మతము

తాతా మధుసూదన్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ‘స్థానిక సంస్థల’ కోటా టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తాతా మధు 1970లో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, పిండిప్రోలు గ్రామంలో తాతా వెంకటకృష్ణయ్య, కమలమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పిండిప్రోలు జిల్లాపరిషత్‌ పాఠశాలలో పడవ తరగతి, ఖమ్మంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ), న్యాయవిద్య పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

తాతా మధు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభాస్యం పూర్తయిన తర్వాత వ్యాపార నిమిత్తం అమెరికాలో అట్లాంటా నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంతో పాటు హోటల్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. ఆయన 1998 నుండి 2014 మధ్యకాలంలో అట్లాంటా తెలుగు సంఘం (తామా) అధ్యక్షుడిగా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) కార్యదర్శిగా పని చేశాడు.[2] ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతుగా అమెరికాలో పలు కార్యక్రమాలు నిర్వహించాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

తాతా మధు విద్యార్థి దశలో ఎస్‌ఎఫ్‌ఐలో పని చేసి, 1986 నుండి 1996వరకు సీపీఎం పార్టీలో, కొంతకాలం ప్రజారాజ్యం పార్టీలో పని చేశాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. తాతా మధు 2015లో ఖమ్మంలో పార్టీ ప్లీనరీ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన 2015, 2021లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ ఛార్జిగా, స్థానిక సంస్థల ఎన్నికలు, పురపాలిక ఎన్నికల్లో పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాడు. ఆయన 2017 నుంచి తెరాస రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నాడు.[4]

తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధు పేరును టిఆర్ఎస్ అధిష్టానం 21 నవంబర్ 2021న ఖరారు చేసింది.[5][6][7] ఆయన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవంబర్ 22న నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశాడు.[8] తాతా మధు 10 డిసెంబర్ 2021లో తెలంగాణ శాసనమండలి కి జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా 14 డిసెంబర్ 2021న ఎన్నికయ్యాడు.[9][10] తాతా మధు 20 జనవరి 2022న శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[11]

తాతా మధు 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[12]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (15 December 2021). "ఆరూ.. కారుకే!". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  2. Sakshi (26 December 2014). "తానా మహాసభలకు కేసీఆర్‌కు ఆహ్వానం". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  3. Andhrajyothy (23 November 2021). "పోరు రసవత్తరం". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  4. Sakshi (13 January 2018). "అట్లాంటాలో మధు తాతాకు ఘన సత్కారం". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  5. Eenadu (22 November 2021). "తెరాస అభ్యర్థిగా తాతా మధు". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
  6. ETV Bharat News. "తెరాస స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  7. Sakshi (22 November 2021). "టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. సగం కొత్తవారికే..!". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
  8. 10TV (22 November 2021). "స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా తాత మధు నామినేష‌న్" (in telugu). Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. V6 Velugu (14 December 2021). "సిక్స్ కొట్టిన టీఆర్ఎస్" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  10. Andhrajyothy (14 December 2021). "స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు విజయం". Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.
  11. Mana Telangana (20 January 2022v). "ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం". Archived from the original on 20 జనవరి 2022. Retrieved 20 January 2022.
  12. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.

చిత్రమాలిక

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తాతా_మధు&oldid=3978851" నుండి వెలికితీశారు