మల్యాల రాజయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్యాల రాజయ్య

ఎమ్మెల్యే, ఎం.పి
పదవీ కాలం
1985 - 1999
నియోజకవర్గం ఆందోల్ శాసనసభ నియోజకవర్గం, సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1936
వెదిర, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
మరణం అక్టోబర్ 15, 2018
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి అనసూయదేవి
సంతానం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

మల్యాల రాజయ్య (1936 - అక్టోబర్ 15, 2018) అందోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, 12వ, 13వ పార్లమెంటు సభ్యుడు. 1985, 1994లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, 1998, 1999ల్లో సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా గెలుపొందాడు.[1] నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో విద్యుత్‌, ఆర్థిక శాఖల మంత్రిగా, నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో గృహనిర్మాణ మంత్రిగా పనిచేశాడు.[2]

జననం - విద్య - ఉద్యోగం

[మార్చు]

రాజయ్య 1936లో కరీంనగర్ జిల్లాలోని వెదిరలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ, ఎల్‌.ఎల్‌.బి చేసిన రాజయ్య మొదట న్యాయవాదిగా పనిచేసి, అటుతరువాత చీరాల, కల్వకుర్తి, హైదరాబాదు సిటీ సివిల్‌ కోర్టుల్లో జడ్జిగా పనిచేశాడు.[3]

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

రాజకీయాలపై ఉన్న ఆసక్తితో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి, 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 1985లో టీడీపీ తరపున అందోలు నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిలారపు రాజనర్సింహపై ఎమ్మెల్యేగా గెలిచి ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశాడు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సి. దామోదర్ చేతిలో ఓడిపోయాడు. 1994లో దామోదర్‌పై గెలుపొంది, నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో గృహానిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశాడు.

1998లో సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో, 1999లో జరిగిన ఎన్నికలో టీడీపీ తరపున ఎంపీగా గెలుపొందాడు. అటుతర్వాత టీడీపీకి రాజీనామా చేసి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, కొంతకాలం అందోలు నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా పనిచేశాడు.

మరణం

[మార్చు]

సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండి సమీపంలోని మేడిబావిలో నివసిస్తున్న రాజయ్యకు 2018, అక్టోబర్ 15 సోమవారంరోజున మధ్యాహ్నం 2 గంటల సమయంలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  2. నమస్తే తెలంగాణ, మెదక్ (16 October 2017). "మాజీ మంత్రి మల్యాల రాజయ్య కన్నుమూత". Archived from the original on 17 October 2018. Retrieved 17 October 2017.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (16 October 2017). "మాజీ మంత్రి మల్యాల రాజయ్య మృతి". Archived from the original on 17 October 2018. Retrieved 17 October 2017.
  4. సాక్షి, హైదరాబాదు (16 October 2017). "మాజీమంత్రి మల్యాల రాజయ్య కన్నుమూత". Archived from the original on 17 October 2018. Retrieved 17 October 2017.