సిద్దిపేట పోలీస్ కమిషనరేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్
మామూలుగా పిలిచే పేరుసిద్దిపేట నగర పోలీస్
ఏజెన్సీ అవలోకనం
ఏర్పాటుఅక్టోబరు 11, 2016
ఉద్యోగులుకమిషనర్ ఆఫ్ పోలీస్
డిప్యూటీ కమిషనర్
అడిషినల్ డిప్యూటీ కమిషనర్
పోలీస్ ఇన్సిపెక్టర్
అసిస్టెంట్ పోలీస్ ఇన్సిపెక్టర్స్
సబ్ ఇన్సిపెక్టర్స్
అధికార పరిధి నిర్మాణం
కార్యకలాపాల అధికార పరిధిసిద్దిపేట జిల్లా, భారతదేశం
Map of సిద్దిపేట పోలీస్ కమిషనరేట్'s jurisdiction.
పరిపాలన సంస్థతెలంగాణ ప్రభుత్వం
సాధారణ స్వభావం
ప్రధాన కార్యాలయంసిద్దిపేట, తెలంగాణ,  భారతదేశం
ఏజెన్సీ అధికారులు
  • ఎన్. శ్వేత ఐపిఎస్[1], కమిషనర్ ఆఫ్ పోలీస్
మాతృ ఏజెన్సీతెలంగాణ పోలీసు
వెబ్‌సైట్
https://siddipetpolice.telangana.gov.in/

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అనేది తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట నగరంలో చట్టాన్ని అమలుచేయడానికి, నేర దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న నగర పోలీసు విభాగం.[2]

దసరా పండుగ సందర్భంగా 2016 అక్టోబరు 11న రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబడిన 21 జిల్లాలు, 4 కొత్త కమిషనరేట్‌లతోపాటు సిద్దిపేట కమిషనరేట్ కూడా అధికారికంగా ఏర్పాటుచేయబడింది.[3]

నూతన భవనం

[మార్చు]

సిద్దిపేట శివారు దుద్దేడ వద్దగల 29 ఎకరాలలో 19 కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో, సాంకేతికత, వసతులతో జి ప్లస్ 2 తరహాలో సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ నూతన భవనం నిర్మించబడింది. కమిషనరేట్ ప్రాంగణంలోనే సీపీ, ఆడిషనల్ డీసీపీలు స్థానిక ఎసీపీకి ప్రత్యేక చాంబర్లు ఉన్నాయి. మొదటి అంతస్తులో పరిపాలన, సి.పి. కార్యాలయ ఉద్యోగుల చాంబర్లు, ఎస్పి కార్యాలయం, స్పెషల్ బ్రాంచ్, వీడియో హాల్, మీడియా, మహిళల విశ్రాంతి గదులు, రెండో అంతస్తులో కమాండ్ కంట్రోల్, ట్రాఫిక్ కంట్రోల్, క్రైమ్ సెల్, ఫింగర్ ప్రింట్ అండ్ క్లూస్ టీం, డిజిటల్ ట్రైనింగ్, సైబర్ ల్యాబ్, సహా పలు ప్రత్యేకమైన గదులు ఉన్నాయి.

ప్రారంభం

[మార్చు]

ఈ నూతన భవనాన్ని 2021 జూన్ 20న ఉదయం 11.46 నిముషాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించి, పోలీసు కమిషనర్‌ జోయల్ డేవిస్ ను అతని ఛాంబర్ లో కూర్చోబెట్టాడు. కమాండింగ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి ముఖ్యంత్రి అక్కడ ఏర్పాటుచేసిన సి.సి. కెమెరాల ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాలలో కెమెరాల పనితీరును పరిశీలించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీష్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, డి.జి.పి. మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, సిపి జోయల్ డేవిస్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.[4][5]

పోలీస్‌ కమిషనర్లు

[మార్చు]

సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటైన సమయంలో శివకుమార్‌ మొదటి సీపీగా పనిచేశాడు. అతని బదిలీ అనంతరం 2018లో జోయల్‌ డెవిస్‌ సిద్దిపేటకు రెండో పోలీసు కమిషనర్‌గా నియామకమయ్యాడు. పోలీసుల సంక్షేమం కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా పోలీసు వెల్ఫేర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను జోయల్‌ డెవిస్‌ అందుబాటులోకి తెచ్చి, కమిషనరేట్‌లో పోలీసు వెల్ఫేర్‌ స్టోర్‌లను ఏర్పాటుచేశాడు. 2021 డిసెంబరు 25న హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీగా బదిలీ అయ్యాడు.

కొన్నిరోజులపాటు సిద్దిపేట ఇన్‌చార్జి పోలీసు కమిషనర్‌గా పనిచేసి, కామారెడ్డి ఎస్పీగా పనిచేస్తున్న ఎన్‌. శ్వేత 2021 డిసెంబరు 27 సోమవారం రోజున పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించింది.[6]

అధికార పరిధి

[మార్చు]

సిద్దిపేట కమిషనరేట్‌ పరిధిలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ అనే 3 డివిజన్లు ఉన్నాయి

  • సిద్దిపేట రూరల్
  • దుబ్బాక
  • గజ్వేల్ రూరల్
  • తొగుట
  • హుస్నాబాద్
  • చీరియల్

పోలీస్ పరేడ్ గ్రౌండ్

[మార్చు]

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పరేడ్ గ్రౌండ్, డయాస్ 2022 జూన్ 2న జరిగిన తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చే ప్రారంభించబడింది.

మూలాలు

[మార్చు]
  1. "Police Department | GOVERNMENT OF TELANGANA, SIDDIPET DISTRICT | India".
  2. "Khammam made police commissionerate". The Hindu. 10 October 2016.
  3. "Telangana gets 21 new districts". The Hindu. 2016-10-11. ISSN 0971-751X. Retrieved 2022-04-27.
  4. "CM KCR సిద్దిపేటలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించిన సీఎం". ETV Bharat News. 2021-06-20. Archived from the original on 2023-02-20. Retrieved 2023-02-20.
  5. "సిద్ధిపేటలో నూతన నిర్మాణాలను ప్రారంభించిన కెసిఆర్". Vaartha. 2021-06-20. Archived from the original on 2021-06-20. Retrieved 2023-02-20.
  6. telugu, NT News (2021-12-26). "Siddipet Medak Police | విధులలో ప్రత్యేక ముద్ర వేస్తున్న పోలీస్ బాస్‌లు". www.ntnews.com. Archived from the original on 2023-02-20. Retrieved 2023-02-20.