Jump to content

మాలోత్ కవిత

వికీపీడియా నుండి
కవిత మాలోత్
మాలోత్ కవిత


లోక్‌సభ సభ్యురాలు (ఎంపీ)
పదవీ కాలం
2019 నుండి 2024 వరకు
నియోజకవర్గం మహబూబాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం 20 నవంబర్ 1980
మరిపెడ, మహబూబాబాదు జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు ధర్మసూత్ రెడ్యా నాయక్, లక్ష్మి
జీవిత భాగస్వామి భద్రు నాయక్
సంతానం 2
నివాసం హైదరాబాదు
మతం హిందూ

కవిత మాలోత్ (జననం 1981) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు.[1] [2] భారత్ రాష్ట్ర సమితి తరపున మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోంది. 2009-2014 మధ్యకాలంలో మహబూబాబాదు శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యురాలిగా పనిచేసింది.[3][4]

జననం

[మార్చు]

కవిత 1980, నవంబరు 20న లంబాడా కులానికి చెందిన రాజకీయ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి రెడ్యా నాయక్, లక్ష్మీ దంపతులకు మహబూబాబాద్ జిల్లా, మరిపెడ గ్రామంలో జన్మించింది. బిఎస్సీ డిగ్రీ పూర్తిచేసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2001, మే 31న కవితకు సీతంపేట కి చెందిన భద్రు నాయక తో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

2009లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కవిత, 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటిచేసి తెలంగాణ రాష్ట్ర సమతి ఆభ్యర్థి ఆజ్మీరా చందూలాల్ పై 15,367 ఓట్ల తేడాతో గెలుపొందింది.[6] 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, నవంబరు 4న తన తండ్రి రెడ్యా నాయక్ తో కలిసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరింది.[7] 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పై 1,46,663 ఓట్ల మెజారిటీతో గెలిచింది.[8][9] 2019 సెప్టెంబరు 19న ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా నియమించబడింది. 2019, అక్టోబరు 9న మహిళా సాధికారత కమిటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా నియమించబడింది. మాలోత్ కవిత 26 జనవరి 2022న మహబూబాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షురాలిగా నియమితురాలైంది.[10]

2024లో 18వ లోక్ సభ మహబూబాబాద్ (ఎస్టీ) లోక్ సభ నియోజక వర్గం నుండి భారత జాతీయ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి అయిన పొరిక బలరాం నాయక్ చేతుల్లో ఓటమి చేందింది.

మూలాలు

[మార్చు]
  1. "Five Ministers call on Jaipal Reddy". The Hindu. 12 September 2010.
  2. "Jagan camp upbeat after Sonia meet | Hyderabad News". The Times of India. Archived from the original on 2012-09-18.
  3. http://www.thehindu.com/news/cities/Hyderabad/article627322.ece?service=mobile
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-18. Retrieved 2016-01-07.
  5. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2021-08-20.
  6. "KAVITHA MALOTH(Indian National Congress(INC)):Constituency- MAHABUBABAD (ST)(WARANGAL) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2020-03-09.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-11-14. Retrieved 2015-12-30.
  8. Sakshi (2019). "Mahabubabad Constituency Winner List in Telangana Elections 2019 | Mahabubabad Constituency MP Election Results 2019". Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
  9. Eenadu (16 April 2024). "గెలిపించేది ఆమె". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  10. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.